ఇప్పటి వరకు మనం అనేక రకాల పెళ్లిల్ల గురించి విన్నాం.. చూశాం. స్వలింగ వివాహాలు, రోబోను పెళ్లి చేసుకున్న వ్యక్తులు, రైస్ కుక్కర్‌ను వివాహం చేసుకున్న వ్యక్తి.. ఆఖరికి బొమ్మను పెళ్లి చేసుకున్న వారి గురించి కూడా విన్నాం. అయితే ఇప్పుడు మీరు వీటన్నింటిని తలదన్నే వివాహం గురించి వినబోతున్నారు. ఇక్కడ ఓ మహిళ దాదాపు 40 సంవత్సరాల నుంచి ప్రేమించి.. ఎట్టకేలకు పెళ్లిచేసుకుంది. ఇంతకు ఎవరా అదృష్టవంతుడు అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇక్కడే మీరు తప్పులో కాలేసినట్లు. ఎందుకంటే.. ఇక్కడ సదరు మహిళ పెళ్లి చేసుకుంది వ్యక్తినో, బొమ్మనో కాదో.. రంగును. అవును మీరు విన్నది నిజమే.. తనకు ఎంతో ఇష్టమైన గులాబీ రంగును సదరు మహిళ వివాహం చేసుకుంది. ఆ వింత వివాహం వివరాలు..
ఇది కూడా చదవండి: అమర జవాన్ చెల్లి పెళ్లిని దగ్గరుండి జరిపించిన తోటి సైనికులు
అమెరికాకు చెందిన సెరా అనే మహిళకు బాల్యం నుంచి పింక్ కలర్ అంటే ప్రాణం. ఆమె దుస్తులు, అలంకరణ సామాగ్రి, చెప్పులు ఇలా ప్రతిదీ పింక్ కలర్ వే ఉంటాయి. అయితే ఓ బాలుడు అడిగిన ప్రశ్న తనను ఆలోచనలో పడేసిందని.. దాని ఫలితమే ఇలా పింక్ కలర్ ని వివాహం చేసుకున్నట్లు తెలపింది. ఈ సందర్భంగా సెరా మాట్లాడుతూ.. ‘‘సుమారు 1980 కాలం నుంచి గులాబీ రంగు నా ఫేవరెట్ కలర్. ఈ క్రమంలో రెండేళ్ల క్రితం నేను బయటకు వెళ్లాను. అప్పుడు కూడా పింక్ కలర్ డ్రెస్సే ధరించాను. ఆ సమయంలో నన్ను చూసిన ఓ బాలుడు… నీకు పింక్ కలర్ అంటే ఇష్టమా అని అడిగాడు.. దానికి అవునని సమాధానం చెప్పాను. అప్పుడు ఆ పిల్లాడు అయితే మీరు పింక్ కలర్ నే పెళ్లి చేసుకొండి అన్నాడు. ఆ బాబు జోక్ గా అన్న ఆ మాట నాకు నచ్చింది. దాంతో నాకు ఎంతో నచ్చే పింక్ కలర్ నే పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నాను’’ అని తెలిపింది.
ఇది కూడా చదవండి : పెళ్లి కూతురు డ్యాన్స్ అదిరిపోయింది.. పెళ్లి కొడుకు ఫిదా.. వీడియో చూస్తేఇక వివాహ సందర్భంగా సెరా ప్రతి దాన్ని పింక్ రంగులోనే అలంకరించింది. తన చేతికి ధరించే రింగు, పెళ్లి డ్రెస్, తలపై ధరించే ముసుగు, కేక్ తో పాటు పెళ్లికి వచ్చే అతిథులు కూడా పింక్ కలర్ దుస్తులే ధరించారు. ఇక వివాహ ప్రమాణాల సందర్భంగా సెరా.. తాను మరణించే వరకు గులాబీ రంగు తప్ప మరో కలర్ దుస్తులు ధరించనని ప్రమాణం చేసింది. ఈ వింత పెళ్లిపై నెటిజనులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు. దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.