ఇంత వరకు ఎవ్వరూ చేయని విధంగా కొత్త ప్రయోగం చేశాడు కేవై. అతడు బీరుతో నడిచే బైకును కనుగొన్నాడు. ఆ బైకు గంటకు 240 కిలోమీటర్ల వేగంంతో పరుగులు పెడుతుంది.
సాధారణంగా బీర్లను తాగటానికి ఉపయోగించటం పరిపాటి. బీర్లంటే బాగా ఇష్టం ఉన్న వారు మూడు నుంచి ఐదు వరకు బీర్లను ఇట్టే తాగేస్తారు. అయితే, బీర్లను తాగటానికి కాకుండా బైకు నడపటానికి ఉపయోగించవచ్చని ఎవ్వరూ ఆలోచించి ఉండరు. కానీ, ఆమెరికాకు చెందిన ఆ వ్యక్తి మాత్రం బీరుతో బైకు నడపవచ్చని అనుకున్నాడు. అనుకున్నదే తడవుగా బీరుతో బైకు నడిపించే పనిలో పడ్డాడు. ఓ ప్రయోగాన్ని చేసి సక్సెస్ కూడా అయ్యాడు. చివరకు బీరుతో నడిచే బైకును కనుగొన్నాడు. ఆ బైకు గంటకు వందల కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే.. అమెరికాకు చెందిన కేవై మైకెల్‌సన్ తరచుగా ఏదో ఒక ప్రయోగం చేస్తూ ఉంటాడు.
ఏదో ఒక కొత్త వస్తువును కనిపెడుతూ ఉంటాడు. గతంలో అతడు రాకెట్ పవర్‌తో పని చేసే టాయిలెట్, జెట్ పవర్‌తో పని చేసే టీ పాట్ వంటి వాటిని తయారు చేశాడు. ఇప్పుడు మరో అద్భుత సృష్టికి తెరతీశాడు. బీరుతో నడిచే బైక్ ఇంజిన్‌ను తయారు చేశాడు. ఈ బైకు గ్యాసు ఇతర ఇంధనాలు అవసరం లేకుండా పని చేస్తుంది. ఈ బైకు 14 గల్లాన్ కెబ్‌తో పాటు హీటింగ్ కాయిల్‌తో పని చేస్తుంది. ఆ హీటింగ్ కాయిల్ బీరును 300 డిగ్రీలు వేడి చేస్తుంది. బీరు వేడి అయినపుడు వచ్చే శక్తి వల్ల ఇంజిన్ పని చేస్తుంది. తద్వారా బైకు పరుగులు పెడుతుంది. ఈ బైకు 240 కిలోమీటర్ల వేగంతో పరుగులు పెడుతుంది.
ఈ బైకు గురించి కేవై చెబుతూ..‘‘ ఈ బైకు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ బైకు విషయంలో నేను ఎంతో క్రియేటివ్‌గా ఆలోచించాను. గతంలో ఎవ్వరూ చేయని విధంగా చేశాను. గ్యాస్ ధరలు రోజు రోజుకు పెరుగుతున్నాయి. నేను తాగను. నేను తాగుబోతును కాను. కాబట్టి.. దాన్ని ఓ ఇంధనంలా వాడటం కంటే ఏం చేయాలో నాకు తోచలేదు’’ అని చెప్పాడు. కాగా, కేవై తయారు చేసిన బైకు ఇప్పటికైతే రోడ్డు మీదకు రాలేదు. అయినప్పటికి కొన్ని పోటీల్లో ప్రథమ బహుమతి గెలుచుకుంది. దాన్ని బయట టెస్ట్ ట్రైల్ చేసిన తర్వాత ఇంట్లోని తన మ్యూజియానికి పరిమితం చేసే అవకాశం ఉంది. మరి, బైకుతో నడిచే ఈ బైకుపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.