రష్యా-ఉక్రెయిన్ల మధ్య కొన్ని రోజులుగా భీకరమైన యుద్ధం జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇరు దేశాల అధ్యక్షుల మధ్య జరిగిన తాజా చర్చలు కూడా విఫలమయ్యాయి. దీంతో ఎవరికివారు తమదైన శైలిలో యుద్ధ వ్యూహాలతో సాగిపోతున్నారు. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ జెలెన్స్కీ చారిత్రక నిర్ణయం తీసుకున్నాడు. యూరోపియన్ యూనియన్ (ఈయూ)లో చేరేందుకు దరఖాస్తు చేసుకున్నాడు. యుద్ధంలో దెబ్బతిన్న తమ దేశం కోసం వెంటనే ప్రత్యేక విధానంలో యూరోపియన్ యూనియన్ సభ్యత్వం పొందేందుకు అనుమతించమని కోరుతూ దరఖాస్తుపై సంతకం కూడా చేశారు. ప్రధాన మంత్రి డెనిస్ ష్మిహాల్, ఉక్రెయిన్ ఏకసభ్య పార్లమెంట్ ఛైర్మన్ రుస్లాన్ స్టెఫాన్‌చుక్ సమక్షంలో ఈ దరఖాస్తు పై సంతకం చేశారు. దీనిపై రాష్ట్రపతి సంతకం కూడా ఉంది.
ఈ ప్రక్రియకు సంబంధించిన ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ..”ఇది ఉక్రెయిన్ ప్రజల హక్కు దీనికి మేము అర్హులం” అని పేర్కొన్నారు. మరోవైపు ఉక్రెయిన్‌పై దురాక్రమణకు పాల్పడినందుకు గానూ రష్యాని ప్రపంచ దేశాలు దౌత్య పరంగా, ఆర్థిక పరమైన విషయాల్లో ఆంక్షలు విధిస్తున్నాయి. అంతేకాదు బెల్జియం, ఫిన్లాండ్, కెనడా తమ గగనతలం నుంచి రష్యన్ విమానాలను నిషేధించిన ఇతర దేశాల జాబితాలో చేరాయి. మరి రష్యాతో యుద్దం కారణంగా ఉక్రెయిన్ ఈయూలో సభ్యత్వం కోరడంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
President @ZelenskyyUa has signed application for the membership of #Ukraine in the European Union.
This is a historic moment! pic.twitter.com/rmzdgIwArc
— Verkhovna Rada of Ukraine (@ua_parliament) February 28, 2022