ఖర్చులు విపరీతంగా పెరుగుతున్న ఈ కాలంలో ఒక్కరిని కని, పెంచి పెద్ద చేయడమే మహా గగనంగా అనిపిస్తుంది. అలాంటిది ఓ వ్యక్తి ఇప్పటికి 138 మందికి తండ్రయ్యాడు.. 150 మంది సంతానం నా టార్గెట్ అంటున్నాడు. ఓరి నీ.. ఇంత మంది పిల్లలు ఏంట్రా సామి.. నువ్వు మనిషివా.. మెషిన్ వా అనిపిస్తుంది కదా. అంతేకాక ఇంత మంది పిల్లలకు తండ్రి అయ్యాడంటే ఓ పట్టాన నమ్మబుద్ది కావడం లేదు కూడా.. ఇదంతా ఫేక్ ఏమో అనిపిస్తుంది. మరి ఆ వివరాలు తెలియాలంటే.. ఇది చదవండి.
యూకేకి చెందిన క్లెవి జోన్స్ అనే 66 ఏళ్ల వ్యక్తి లెక్కల మాస్టారుగా పని చేసి రిటైర్ అయ్యాడు. ఇప్పటి వరకు 129 మంది పిల్లలకు తండ్రిని అయ్యాను.. మరో 9 మంది గర్భంలో ఉన్నారు.. 150 మంది సంతానమే నా టార్గెట్ అంటున్నాడు. ఇంత మంది ఎలా సాధ్యం అంటే.. వీర్య దానం(స్పెర్మ్ డోనేటింగ్). గత పదేళ్లుగా క్లెవి జోన్స్ వీర్య దానం చేస్తూ.. ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపుతున్నాడు.
ఈ సందర్భంగా క్లెవి జోన్స్ మాట్లాడుతూ.. ‘‘దేశంలో వీర్యాన్ని అమ్మె క్లినిక్ లు, వ్యాపారులు చాలా మంది ఉన్నారు. కానీ వారు ఎవరు దానం చేయరు.. అమ్ముతారు. ఈ వీర్య దానం గురించి నాకు పదేళ్ల క్రితం తెలిసింది. ఫేస్ బుక్ లో కొందరు వీర్య దానం చేసే వారి వివరాలు తెలపాలి అంటూ ఓ ప్రకటన ఇచ్చారు. నేను స్పందించి.. వీర్య దానం చేశాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు నా వీర్య దానం ద్వారా 129 మంది పిల్లలు భూమ్మీదకు వచ్చారు. మరో 9 మంది తల్లి గర్భంలో ఉన్నారు. నేను చేసిన పని ఎన్నో కుటుంబాల్లో సంతోషాన్ని నింపింది. నాకది చాలు. అందుకే ఈ పని చేస్తున్నాను. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక మందికి వీర్య దానం చేసిన వ్యక్తిగా నేను గుర్తింపు పొందాను. నా ద్వారా 150 మంది బిడ్డలకు జన్మ నివ్వాలనేది నా టార్గెట్. దాన్ని సాధించేవరకు వీర్య దానం చేస్తూనే ఉంటాను’’ అని తెలిపాడు. క్లెవి వ్యాఖ్యలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.