ఓ కుటుంబంలోని ఏడుగురు ఒకేరోజు జన్మించారు. వారు అనుకోకుండా వారి పుట్టిన రోజు ఒకే తేదీన రావడం విశేషంగా ఉంది. సామూహికంగా ఏడుగురి బర్త్ డేను ఒకే రోజు జరుపుకుని గిన్నిస్ రికార్డ్ సాధించారు.
ఒక్కోసారి అనుకోకుండా విచిత్రాలు జరుగుతుంటాయి. వాటిని అద్భుతాలుగా చూస్తుంటాం. అయితే వాటి ప్రత్యేకతను బట్టి రికార్డ్‌లు సృష్టించబడతాయి. వింత సంఘటనలు, విచిత్రాలు, అద్భుతాలు జరిగినప్పుడు గిన్నిస్ రికార్డ్ లో చోటు చేసుకుంటాయి. అలాంటి కోవకు చెందినదే ఓ ఫ్యామిలీ బర్త్ డే. ఆ కుటుంబంలోని ఏడుగురు ఒకే రోజు జన్మించి గిన్నిస్ రికార్డ్ సాధించారు. వారు ఏడుగురు పుట్టిన రోజును ఒకే తేదీన జరుపుకుంటారు. వారు అనుకోకుండా ఒకే కుటుంబానికి చెందిన వారుగా గుర్తించారు. అసలు పూర్తి వివరాలేంటో తెలుసుకుందాం..
పాకిస్తాన్ లోని లార్కానా జిల్లాకు చెందిన మాంగి కుటుంబం ఉంది. ఆ కుటుంబంలో తండ్రి అమీర్ అలీ, తల్లి ఖుదేజా అనే దంపతులు ఉన్నారు. వారికి 19-30 సంవత్సరాల వయస్సు గల ఏడుగురు పిల్లలు ఉన్నారు. వారి పేర్లు.. సింధూ, ససూయ్-సప్నా, అమీర్-అంబర్, అమ్మర్-అహ్మర్‌లు మొత్తం ఏడుగురు ఉన్నారు. మూడుసార్లు కవలలు జన్మించారు. ఇక్కడ విచిత్రమేంటంటే.. పుట్టిన రోజులు ఒకే రోజున వచ్చాయి. ఈ ఏడుగురు సంతానం ఆగస్టు 1వ తేదీన జన్మించారు. దీనితో ఒకేరోజు పుట్టిన అత్యధిక కుటుంబ సభ్యుల పేరిట ప్రపంచ రికార్డ్ నెలకొల్పారు. ఈ కుటుంబంలో మరో సంఘటన ఈ దంపతుల పెళ్లిరోజు కూడా ఆగస్టు 1వ తేదీనే. వీరి పెళ్లి 1991, ఆగస్టు 1న జరిగగా.. వారి పిల్లలు కూడా వారి పెళ్లిరోజే పుట్టడం విశేషంగా భావిస్తున్నారు. తల్లిదండ్రులతో కలిపి మొత్తం ఈ కుటుంబ సభ్యులు 9 మంది ఉన్నారు.
గతంలో అమెరికాలో కమ్మిన్స్ కుటుంబానికి చెందిన ఐదుగురు పిల్లలు ఫిబ్రవరి 20న పుట్టినందుకు వీరిది రికార్డ్ నెలకొంది. ఆ రికార్డ్ ను ప్రస్తుతం అమీర్ అలీ, ఖుదేజా దంపతులు బ్రేక్ చేశారు. ఖుదేజాకు పుట్టిన ఏడుగురు సంతానం ఎలాంటి వైద్యప్రమేయం లేకుండా.. సహజ కాన్పులోనే జన్మించారని గిన్నిస్ రికార్డ్ అధికారులు తెలిపారు. అన్నీ సహజ జననాలతో పుట్టిన బిడ్డలందరికీ సామూహికంగా బర్త్ డే నిర్వహిస్తున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. నిజంగా ప్రపంచంలో వింతల్లో ఒకటి.