భార్యాభర్తల మధ్య గొడవలు రావటం సర్వ సాధారణం. కొన్ని సమయాల్లో వివాహేతర సంబంధాలు ఇద్దరి మధ్యా గొడవలకు దారి తీస్తుంటాయి. అయితే, కొంతమంది మగాళ్లు ఏవో కారణాల వల్ల వ్యభిచార గృహాలకు వెళ్లి తమ కోరికెల్ని తీర్చుకుంటూ ఉంటారు. ఇదే ఓ మహిళ జీవితంలో పెను మార్పు తెచ్చింది. ఆమెను ఓ వేశ్యగా మార్చేసింది. పూర్తి వివరాల్లోకి వెళితే.. థాయ్‌లాండ్‌కు చెందిన ఓ మహిళకు కొన్నేళ్ల క్రితం పెళ్లయింది. పెళ్లయిన కొన్ని నెలలు భార్యాభర్తల మధ్య కాపురం బాగానే సాగింది. తర్వాతినుంచి గొడవలు రావటం మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే భర్త ఆమెను సరిగా పట్టించుకోవటం మానేశాడు.
భర్త ప్రవర్తనలో రోజు రోజుకు మార్పులు రావటంతో అతడిపై నిఘా పెట్టింది. ఓ రోజు అతడి వ్యాలెట్‌ను చెక్ చేసింది. అందులో ఓ వ్యభిచార గృహం పేరు ఉన్న చీటీ కనిపించింది. భర్త వ్యభిచార గృహానికి వెళుతున్నాడని తెలిసి ఎంతో బాధపడింది. తన భర్త వెళుతున్న ఆ వ్యభిచార గృహం గురించి మరిన్ని వివరాలు తెలుసుకోవాలని ఆమెకు అనిపించింది. ఇందుకోసం చీటీలో ఉన్న ఫోన్ నెంబర్‌కు ఫోన్ చేసింది. వాళ్లు కొన్ని వివరాలు చెప్పి, వ్యభిచార గృహం దగ్గరకు వస్తే మరింత తెలుస్తుందని అన్నారు. భర్త అక్కడివారితో తిరిగి లేనిపోని రోగాలు తెస్తాడేమోనని భయపడింది. వెంటనే అక్కడి వెళ్లింది.
వ్యభిచార గృహం మేనేజర్ ఆమెను చాలా చక్కగా రిసీవ్ చేసుకున్నాడు. అక్కడ జరుగుతున్నదంతా ఆమెకు వివరించాడు. ఇంటర్‌కోర్స్ కాకుండా మిగిలినదంతా ఉంటుందని చెప్పాడు. దీంతో ఆమె ఊపిరి పీల్చుకుంది. ఆ మేనేజర్ ఆమెను అక్కడ పని చేస్తారా? అని అడిగాడు. ఇందుకు ఆమె సరేనంది. ఇక, అప్పటినుంచి అక్కడే పనిచేస్తోంది. ఎప్పుడైనా తన భర్త ఎదురు పడితే పరిస్థితి ఎలా ఉంటుందోనని బాధపడుతోంది. మరి, భర్త మీద రివేంజ్‌తో వ్యభిచారం గృహంలో చేరిన ఈ ధాయ్ మహిళ ఉదంతంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.