ఉదయం ఆమె ఫిజిక్స్ పాఠాలు చెప్పే టీచరమ్మ. చీకటి పడితే మాత్రం లైట్లు ఆపేసి నగ్న చిత్రాలు తీసి.. అడల్ట్ సైట్‌లో పోస్టు చేస్తుంటుంది. చాలాకాలం ఆమె ఈ విషయాన్ని గుట్టుగానే దాచుకుంది. కానీ, ఓ విద్యార్థి ఆమె నగ్న చిత్రాలు చూడటంతో స్కూల్ మొత్తం ఈ విషయం పాకింది. చివరికి చేసేది లేక ఆమె ఫిజిక్స్ టీచర్ ఉద్యాగానికి రాజీనామా చేసింది. అయితే ఆమె చేసిన పనికి ఎక్కడా సిగ్గుపడలేదు, పశ్చాతాపం అస్సలు ప్రదర్శించలేదు. ఇంకా తాను చేసింది సరైందే అంటూ సమర్థించుకుంటోంది కూడా. పైగా స్కూల్ పిల్లాడికి పో*ర్న్ సైట్ యాక్సెస్ ఎలా వచ్చింది అంటూ తల్లిదండ్రులనే ఎదురు ప్రశ్న వేసింది. ఈ వార్త వినగానే ఆమెను అంతా తిట్టుకున్నారు. కానీ, ఆమె కష్టం తెలిసిన తర్వాత ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు.
అసలు కథ ఏంటంటే.. ఆమె పేరు క్రిస్టీ బూచన్. 33 ఏళ్ల ఈ మహిళ స్కాట్‌లాండ్‌లోని బానర్మన్ హైస్కూల్‌లో ఫిజిక్స్ టీచర్‌గా విధులు నిర్వహించేది. ఉదయం సమయంలో టీచర్‌గా పిల్లలకు పాఠాలు చెప్పేది. చాలా ఏళ్లు ఆమె ఫిజిక్స్ టీచర్‌గానే అందరికీ తెలుసు. కానీ, రాత్రి ఒంటి గంటవరకు ఆమె మెలకువగా ఉంటూ ఇంకో పార్ట్ టైమ్ జాబ్ చేసేది. ఆ పార్ట్ టైమ్ జాబ్ గురించి ఎవరికీ తెలియదు. కానీ, ఓ విద్యార్థి ఆ రెండో ఉద్యోగం గురించి కనుక్కున్నాడు. ఆమె చేస్తున్న రెండో ఉద్యోగం గురించి స్కూల్‌లో అందరికీ తెలియజెప్పాడు. దాంతో ఆమె చేసేది లేక తన ఉద్యోగానికి రాజీనామా చేసింది.
ఇంతకీ ఆమె చేసే పని ఏంటంటే.. ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ వెబ్‌సైట్లో తన నగ్న చిత్రాలను పోస్ట్ చేసేది. రోజూ అర్ధరాత్రి వరకూ మెలకువగా ఉండేది. వెబ్‌సైట్లో పోస్ట్ చేసేందుకు ఫొటో షూట్ నిర్వహించుకుని వాటిని సైట్‌లో పోస్ట్ చేసేది. దాని ద్వారా ఆమెకు కొంత ఆదాయం వచ్చేది. అలా కొన్నేళ్లపాటు చేసుకొచ్చింది. కానీ, ఓ విద్యార్థి వల్ల ఆమె చేస్తున్న రెండో పని గురించి అందరికీ తెలిసింది. ఆమెపై క్రమశిక్షణ కమిటీ విచారణకు కూడా ఆదేశించింది. అయితే ఒకరు తనను తప్పుబట్టేది ఏంటని ప్రశ్నించి.. తానే ఉద్యోగానికి రాజీనామా చేసింది. అయితే ఆమె ఎందుకు అలా చేసింది? దాని వెనకాల ఏదైనా బలమైన కారణం ఉందా? అనే విషయాలు ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారాయి.
అయితే ఆ టీచర్ ఎందుకు అలా చేయాల్సి వచ్చిందో తెలుసుకుంటే మీరు కూడా ఆమెకు మద్దతుగా నిలుస్తారు. క్రిస్టీ బూచన్‌కు 11 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. అతడిని పోషించుకునేందుకు, అతని ఆలనాపాలనా చూసుకునేందుకు టీచర్‌గా విధులు నిర్వహించగా వచ్చే డబ్బు సరిపోయేది కాదు. పైగా అతనికి సర్జరీ కూడా చేయించాలట. డబ్బు కోసం ఆలోచిస్తూ ఉండగా.. ఆమెకు ఈ ఓన్లీ ఫ్యాన్స్ అనే సైట్ గురించి తెలిసింది. అప్పటికే చాలా మంది వారి నగ్న చిత్రాలను పోస్ట్ చేసి నెలకు వేల డాలర్లు సంపాదిస్తున్నట్లు ఆమె తెలుసుకుంది. డబ్బు కోసం తాను కూడా అలా చేయాలని ఫిక్స్ అయ్యింది. అయితే ముందుగా ఆ విషయాన్ని తన బాయ్‌ఫ్రెండ్‌కి చెప్పి అతని అంగీకారంతోనే ఆ పని ప్రారంభించినట్లు వెల్లడించింది.
A physics teacher resigns after students discover her OnlyFans site‼️👀 pic.twitter.com/ERbobfeLvY
— Daily Loud (@DailyLoud) December 2, 2022
ఇప్పుడు క్రిస్తీ తాను చేస్తున్న పనిని సమర్థించుకుంటోంది. “నిజానికి ఫిజిక్స్ టీచర్‌గా చేస్తూ ఇలాంటి పని చేశానని నన్ను అంతా నిందిస్తున్నారు. ఆ పని చేస్తున్నందుకు నేను ఎంతగా బాధపడుతున్నానో, నరకం అనుభవిస్తున్నానో ఎవరికీ తెలియదు. నేను ఏడవని రోజు ఉండదు. ఉదయం టీచర్‌గా చేస్తూ.. అర్ధరాత్రి వరకు నిద్రలేకుండా ఈ పని చేస్తున్నాను. అయినా నేను చేసే పనిని నేను సమర్థించుకుంటాను. ఒక స్కూల్ విద్యార్థికి 18+ సైట్‌కి యాక్సెస్ లభించింది అంటే.. వాళ్ల తల్లిదండ్రులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు? అయినా నా కొడుకు కోసం నేను ఏం చేయడానికైనా సిద్ధమే. ఈ మాట ఎంత మంది చెప్పగలరు? నేను చేసిన పనిని ఏ తల్లిదండ్రులు చేయగలరు? నాకు విద్యార్థులు, ఉపాధ్యాయుల నుంచి మద్దతు లభిస్తోంది. నా శరీరం నా ఇష్టం.. ఏం చేయడానికైనా నాకు హ్కకు ఉంటుంది. ఎవరూ మిమ్మల్ని జడ్జ్ చేయడానికి లేదు అని నాకు సపోర్ట్ ఇస్తున్నారు” అంటూ క్రిస్టీ బూచన్ స్థానిక మీడియాకి తన వర్సన్‌ని వినిపించింది.
Full story on our IG‼️👀 https://t.co/RJNS6izRNK pic.twitter.com/ZjjlqXvxCa
— Daily Loud (@DailyLoud) December 3, 2022