ప్రపంచ కుబేరుల్లో ఒకరిగా కొనసాగుతోన్నా బిల్ గేట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రముఖ టెక్ సంస్థ మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకులైన ఈయన సేవ కార్యక్రమాల్లో ముందుంటారు. తనకు వచ్చే సంపాదనలో ఎక్కువ శాతం దాన ధర్మాలు చేస్తుంటారు. కొంతకాలం క్రితం వరకు ఆయన సేవ కార్యక్రమాల్లో ఆయన భార్య మిలిందా తోడుగా ఉండేది. అయితే ఇటీవలే బిల్ గేట్స్ తన భార్య మిలిందా గేట్స్ కు విడాకుల ఇచ్చిన సంగతి తెలిసిందే. బిల్ గేట్స్ చాలా మంచి వ్యక్తి అని, ఆయనతో విడిపోయిన తర్వాత తానో ఎంతో మనోవేదనకు గురయ్యానని మిలిందా ఓ ఇంటర్వ్యూలో ఆవేదన వ్యక్తం చేసింది. అయితే ప్రస్తుతం ఆమె గురించి ఓ వార్త వినిపిస్తోంది. ఓ జర్నలిస్ట్ ప్రేమలో పడినట్లు. ప్రస్తుతం ఆయనతో డేటింగ్ లో ఉన్నట్లు అమెరికన్ మీడియాలో కథనాలు వస్తున్నాయి.
ప్రపంచ కుబేరుల్లో ఒకరైన బిల్ గేట్స్ 1994లో మిలిందా గేట్స్ ను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వీరికి ముగ్గురు పిల్లలు కూడా ఉన్నారు. ఎంతో హాయిగా సాగుతున్న వారి దాంపత్యంలో ఏమైందో ఏమో కానీ ఓ సంచలన నిర్ణయం తీసుకున్నారు. తమ 27 ఏళ్ల వివాహ బంధానికి ముగింపు పలికి ప్రపంచానికి షాక్ ఇచ్చారు. బిల్ గేట్స్ దంపతులిద్దరు తమ సోషల్ మీడియా అకౌంట్ల ద్వారా ఈ విషయాన్ని తెలియజేశారు. ఆగస్టులో వీరికి విడాకులు మంజూరయ్యాయి. వారు విడిపోయినప్పటికీ.. మిలిందా గేట్స్.. తన పేరులో తన కుటుంబం పేరుని తొలగించలేదు. బిల్ గేట్స్‌తో విడిపోయిన తర్వాత తాను భరించలేని వేదనకు గురైనట్టు కూడా మిలిందా గేట్స్ ఇటీవల ఓ ఇంగ్లీష్ మ్యాగజైన్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో తెలిపారు. అయితే ప్రస్తుతం ఆ బాధ నుంచి మిలిందా ఉపశమనం పొందుతున్నట్టు తెలుస్తోంది.
కుబేరురాలైన మిలిందా మరొసారి ప్రేమలో పడినట్టు సమాచారం. 58 ఏళ్ల మిలిందా 60 ఏళ్ల జాన్ డ్యూ ప్రీ అనే రిపోర్టర్ తో డేటింగ్ చేస్తోందనే వార్త వినిపిస్తోంది. గత కొన్ని నెలలుగా వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఓ ఆన్ లైన్ మీడియా సంస్థ తన కథనంలో పేర్కొంది. కానీ వీరిద్దరూ ఎలా కలిశారన్న విషయంలో మాత్రం ఇంకా స్పష్టత లేదు. అయితే పలుమార్లు వీరిద్దరు కలిసి మీడియా కంటికి చిక్కారు. ఏప్రిల్ లో నెట్స్‌కి, సెలాటిక్స్కి మధ్య జరిగిన బాస్కెట్‌బాల్ ఆటకు వీరిద్దరూ కలిసి వెళ్లారు. ప్రస్తుతం వీరిద్దరు ప్రేమలోకంలో విహరిస్తున్ననట్లు స్థానిక మీడియాలు పేర్కొంటున్నాయి. వీరిద్దరిపై వస్తున్న వార్తలను మిలిందా, జాన్ డ్యూ ప్రీ ఇద్దరిలో ఎవరూ ఇంతవరకు స్పందించలేదు. దీంతో వీరిద్దరిపై వస్తున్న ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టు అయింది.