జనాభా నియంత్రణ, సుఖ వ్యాధులు, ఎయిడ్స్ వంటి ప్రాణాంతక వ్యాధుల నుంచి రక్షణ కోసం కండోమ్ లను ఉపయోగించాలని ప్రభుత్వాలు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తాయి. కొన్ని దేశాల్లో అయితే ప్రభుత్వాలే స్వయంగా ప్రజలకు వీటిని ఉచితంగా పంచిపెడతాయి. అలాకాకుండా సొంతంగా కొనుగోలు చేసుకున్నా మహా అయితే రూ. 100 లోపే లభిస్తాయి. అలాంటిది ఒక కండోమ్ ప్యాకెట్ రూ. 60 వేలు.. వింటానికి ఇది ఆశ్చర్యంగా ఉన్నా.. మన దేశంలో మాత్రం కాదులేండి.
వివరాల్లోకి వెళితే.. వెనిజులా దేశంలో నెలకొన్న ఆర్థిక సంక్షోభం కారణంగా ఒక్క ప్యాక్ భారత కరెన్సీలో పోల్చితే.. ఏకంగా రూ. 60 వేలకు చేరింది. ఆ దేశంలో వీటి ధర పెరగడానికి కారణం అక్కడి చట్టాలేనని తెలుస్తోంది. వెనిజులాలో అబార్షన్ చట్ట విరుద్ధం ఉంది. చట్టవిరుద్ధంగా అబార్షన్లు చేస్తే కఠిన శిక్షలు పడతాయి. దీంతో జనాలు వీటిని కొనుగోలు చేయక తప్పడం లేదు.
2015లో ఐక్య రాజ్యసమితి ఇచ్చిన నివేదిక ప్రకారం.. ప్రపంచంలో అత్యధికంగా యువతులు గర్భిణీలున్న దేశాల్లో వెనిజులా ఒకటి. ఈ నేపథ్యంలోనే వెనిజులాలో అబార్షన్ చట్టాలను కఠినతరం చేశాయి. దీంతో పెద్ద ఎత్తున వాటికి డిమాండ్ పెరగడంతో ధరలకు రెక్కలొచ్చాయి. ధరలు ఈ రేంజ్లో పెరగడంతో ఆ దేశంలో ప్రజలు ఏం చేయలేని స్థితిలో తలలు పట్టుకుంటున్నారు. ప్రస్తుతం వెనిజులాలో నెలకొన్ని పరిస్థితుల పై సోషల్ మీడియా లో పోస్ట్లు వైరల్ అవుతున్నాయి. ఈ విషయం పై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Fun fact: People line up outside the shop to buy condom*, which in Venezuela are worth roughly ₹60,000.
— Srikanth Pragallapati (@imSriKanthP) June 11, 2022