పాకిస్థాన్ లో రాజకీయ ప్రముఖలపై కాల్పు జరిపిన ఘటనలు అనేకం జరిగాయి. ఈ కాల్పులో కొందరు రాజకీయ ప్రముఖులు మృతిచెందారు. అలానే అప్పుడప్పుడు నేతలపై దుండగులు కాల్పులు జరిపిన ఘటనలు మనం అనేకం చూశాం. తాజాగా పాక్ మాజీ మాజీ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ పై కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఇమ్రాన్ ఖాన్ గాయపడ్డారు. ఈ ఘటన పంజాబ్ ప్రావిన్స్ లో చోటుచేసుకుంది. పంజాబ్ ప్రావిన్స్ రాష్ట్రంలోని వజీరాబాద్ లో ర్యాలీ జరుగుతుండగా దుండగలు కాల్పులు జరిపారు. ఇమ్రాన్ ఉన్న కంటైనర్ వద్దనే కాల్పులు జరిగాయి. ఈ ఘటనలో ఇమ్రాన్ గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పులో ఇమ్రాన్ ఖాన్ మేనేజర్ రషీద్, మాజీ గవర్నర్ ఇమ్రాన్ ఇస్మాయిల్ కూడా గాయపడినట్లు తెలుస్తోంది. ఈ కాల్పుల్లో మొత్తం ఐదు మంది గాయపడినట్లు సమాచారం. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రస్తుతం క్షేమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇంకా ఈ ఘటన గురించి పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.
పంజాబ్ ప్రావిన్స్ లోని వజీరాబాద్ లో గురువారం ఇమ్రాన్ ఖాన్ ‘రియల్ ఫ్రీడమ్’ పేరుతో ర్యాలీ చేపట్టారు. ర్యాలీ సందర్భంగా ఆయన ఓపెన్ టాప్ కంటైనర్ లో ప్రయాణం చేశారు. ఈక్రమంలో తన వాహనం జఫారలిఖాన్ చౌక్ వద్దకు చేరుకునే సరికి దుండగులు ఆయనపై కాల్పులు జరిపినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ క్రమంలో ఇమ్రాన్ ఖాన్ కి స్వల్ప గాయాలయ్యాయి. కాల్పుల అనంతరం ఆయనను బుల్లెట్ ప్రూఫ్ వాహనంలోకి మార్చుతున్నట్లు వీడియోల్లో కనిపించింది. ఈ కాల్పుల ఘటనలో పీటీఐ లీడర్ ఫైజల్ జావేద్ సైతం గాయపడినట్లు స్థానియా మీడియా తెలిపింది. ఈ ఘటనపై పీటీఐ నేతలు, కార్యకర్తలు తీవ్రంగా ఖండిస్తున్నారు.
BREAKING NEWS: Former Pakistan prime minister Imran Khan shot in assassination attempt. Reports he was hit in the leg but survived & now being treated in hospital. pic.twitter.com/PWgUgAdt3C
— Piers Morgan (@piersmorgan) November 3, 2022
Imran Khan, the former prime minister of Pakistan, was assassinated in Punjab.
His convoy was fired upon. Imran Khan, whose convoy was fired upon, was shot in the leg. Two more people from Han’s team were injured in the incident. #ImranKhan #Pakistan #Punjab pic.twitter.com/qC5yLpktsN— Burak (@Spawnn75) November 3, 2022