కొంతమందికి కలకి, వాస్తవానికి తేడా తెలియదు. బాత్రూమ్‌లో టాయిలెట్ పోసుకుంటున్నట్లు ఫీలవుతూ బెడ్ తడిపేస్తూ ఉంటారు. కొంతమంది నిద్రలో వాకింగ్ చేస్తుంటారు. కల కంటున్నామనే భ్రమలో ఉంటారు. అయితే కలలో తాము పట్టుకున్న వస్తువులు, వాస్తవంగా పట్టుకున్న వస్తువులు ఒకటే అని భ్రమ పడుతుంటారు. అలా భ్రమపడి కలలో తన పురుషాంగాన్ని కోసుకున్నాడొక పెద్దమనిషి. కలలో తన పురుషాంగాన్ని మేక అనుకుని కత్తులతో వధించుకున్నాడు. ఈ చిత్ర విచిత్ర ఘటన ఘనా సెంట్రల్ రీజియన్ ‘ఆస్సిన్ ఫోసు’ సిటీలో చోటు చేసుకుంది. ఈ పెద్ద మనిషికి కలకి, నిజానికి తేడా తెలియకుండా పోయింది. నిద్రలో కల కంటూ మేకని వధిస్తున్నాననుకుని తన పురుషాంగాన్ని కోసుకున్నాడు.
కోఫి అట్ట(47) ఒక రైతు. తన భార్యకి డిన్నర్ ప్రిపరేషన్‌కి సహాయం చేద్దామని మేకని వధిస్తున్నట్టు కల కంటున్నాడు. కలలో కత్తులతో మేక అనుకుని తన పురుషాంగాన్ని కోసుకున్నాడు. పొద్దున్న లేచి చూసేసరికి పురుషాంగం నుంచి తీవ్ర రక్తస్రావం కావడం, విపరీతమైన నొప్పులు వస్తుండడంతో భరించలేక అతను గట్టిగా అరిచాడు. వెంటనే పొరుగింటి వారు వచ్చి అతన్ని హాస్పిటల్‌కి తరలించారు. గాయాలపాలైన అతని పురుషాంగాన్ని వైద్యులు ఆపరేషన్ ద్వారా అతికించారు. ప్రస్తుతం అతను ప్రాణాలతో పోరాడుతున్నాడు. అయితే ఈ ఘటన జరిగినప్పుడు తన భార్య ఇంట్లో లేదని ఆ వ్యక్తి చెప్పాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై మీ అభిప్రాయమేంటో కామెంట్ ద్వారా, రియాక్షన్ ఏంటో ఎమోజీ ద్వారా తెలపండి.
వీడియో కోసం ఇక్కడ క్లిక్ చేయండి