అంతర్జాతీయ బీరు దినోత్సవం ప్రతి సంవత్సరం ఆగస్టు మొదటి శుక్రవారం రోజున నిర్వహించబడుతుంది. బీరు తయారు చేసేవారిని అభినందించడానికి, స్నేహితులందరు కలిసి బీరును తాగడానికి గుర్తుగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న మందుప్రియులు ఈ దినోత్సవాన్ని జరుపుకుంటారు. వేడిగా వాతావరణం ఉన్నప్పుడు గొంతులో చల్లని బీర్ పడితే వచ్చే మజాయే వేరు. ఆ విషయం గురించి బీర్ ప్రియులకు ఎక్కువగా తెలుస్తుంది. అయితే అన్నింటికీ ఒక రోజు ఉన్నట్లే బీర్‌కు కూడా ఒక రోజు ఉంది. ఆ రోజును ఇంటర్నేషనల్ బీర్ డే (ఐబీడీ) అని పిలుస్తారు.
2017లో అమెరికా కాలిఫోర్నియాలోని శాంతా క్రూజ్ లో మొదటిసారిగా ఈ బీరు దినోత్సవం జరుపబడింది. అప్పటినుండి 2012 వరకు ఆగస్టు 5వ తేదీన జరుపుకున్న ఈ దినోత్సవంను 2013 నుండి ఆగస్టు నెల మొదటి శుక్రవారం నాడు జరుపుకోవడం ప్రారంభించారు. చిన్న కార్యక్రమంగా ప్రారంభమై, కొద్దికాలంలోనే అంతర్జాతీయ స్థాయి వేడుకగా మారిన బీరు దినోత్సవం 6 ఖండాలలోని 80 దేశాలకు చెందిన దాదాపు 207 నగరాల్లోని బీరు ప్రియులు ఉత్సవాలు చేసుకుంటున్నారు.
మన దేశంలోనూ దీన్ని జరుపుకుంటారు. బీర్డే సందర్బంగా పలు బార్లు, హోటల్స్, పబ్‌లలో బీర్లపై ప్రత్యేక రాయితీలను అందిస్తుంటారు. బీర్ కు ఎన్నో వేల ఏళ్ల చరిత్ర ఉంది. దానికి గుర్తింపుగానే బీర్ డేను జరుపుకుంటారు.
ఈ సందర్భంగా బీర్ కొటేషన్స్ తో కూడిన ఈ వీడియో వీక్షించండి.