ఆదర్శ దంపతులు అంటే వీరే. అదృష్ట మంటే వీరిదే. అంతలా పొగుడుతున్నారు వీరేం చేశారని అనుకుంటున్నారా. అంతర్జాతీయ క్రీడల్లో పాల్గొని లక్షలు గెలిచారండీ.. ఒకటి కాదు 10 కాదూ 82 లక్షలు కొల్లగొట్టారు. ఇంతకూ ఆ గేమ్ ఏమనుకుంటున్నారు.
ఆదర్శ దంపతులు అని ఎవరినీ అంటాం భర్త అడుగు జాడల్లో భార్య, భార్య మాటను వినే భర్తను ఇలా పిలుస్తుంటారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా ఇద్దరు సర్దుకు పోయి బతుకుతూ పది మందికి ఆదర్శంగా నిలుస్తారు. పిల్లల ఆలనా పాలనా నుండి వారిని ఓ దారిన పెట్టే బాధ్యతను ఇద్దరూ సమానంగా తీసుకుంటారు. కానీ మనం చెప్పుకునే ఆదర్శ జంట కాస్త విభిన్నం. ఆదర్శ దంపతులు అనకుండా ఉండలేం. అదృష్టం అంటే వీరిదే. ఎందుకు అంతలా పొగుడుతున్నారు అనుకుంటున్నారా. అసలు విషయం తెలిస్తే మీరు కూడా పొగుడుతారండీ. భార్యా భర్తలిద్దరూ జాక్ పాట్ కొట్టారండీ.. లక్ష, పది లక్షలో కాదూ ఏకంగా రూ. 82 లక్షలు. కానీ ఏ లాటరీ తీసో కాదూ.. పేకాట ఆడి గెలుచుకున్నారు.
హా.. అని ఫీల్ అవుతున్నారు. బుగ్గన వేళ్లు నొక్కుకుంటున్నారా.. అవునండీ వీరిద్దరూ కలిసి కాసినో ఆడి ఇంత డబ్బులు సంపాదించారు. ఇంతకీ ఈ ఆదర్శ దంపుతులు ఎక్కడ ఉన్నారనుకుంటున్నారు. అమెరికాలోని లాస్ వెగాస్‌లో. శనివారం రాత్రి రాంపార్ట్ క్యాసినలో పేకాట ఆడి.. ఏకంగా లక్ష డాలర్లు అంటే భారత కరెన్సీలో రూ. 82 లక్షలను కొల్లగొట్టారు ఈ దంపతులు. అయితే ఇంత డబ్బు చూడగానే ఆ దంపతుల ఆనందానికి అవధుల్లేవు అట. ఇద్దరు పక్క పక్కనే ఆడుతూ గెలుచుకున్నారట. అయితే వారి వివరాలు తెలియరాలేదు. ఒకరు 87,240 డాలర్లు, మరొకరు 13,048 డాలర్లు.. మొత్తంగా లక్ష డాలర్లు గెలుచుకున్నట్లు తెలుస్తోంది. మరీ అంత డబ్బు గెలవడం, అందులోనూ పేకాట ఆడి గెలుచుకోవడం అంటే మామూలు మాటలు కాదూ కదండీ. మరీ మీరేమంటారో కామెంట్ల రూపంలో తెలియజేయండి.