చీకటి పడితే మనిషిని భయపెట్టేది దయ్యం కాదు, దయ్యం అనే పదం. చిన్నప్పటి నుంచి దయ్యం, దయ్యం అని చీకట్లోకి వెళ్లకుండా చేస్తారు పెద్దలు. ఆ భయం అలానే ఎదిగే వరకూ మనుషులతో ప్రయాణం చేస్తుంటుంది. తెల్లారితే దయ్యం లేదు, భయ్యం లేదు పోరా బొకడా అని మనకి మనం ధైర్యం చెప్పుకున్నా.. మళ్ళీ చీకటి పడితే ఆ భయం అలానే వెంటాడుతుంది. ఒంటరిగా కారు చీకటిలో వెళ్లాలంటే ప్యాంట్ తడిసిపోయే పరిస్థితి. దయ్యాలు లేవని మేధావులు చెప్తున్నా.. మరో పక్క హర్రర్ సినిమాలతో దయ్యాలు ఉన్నాయనే భ్రమని నిజం చేస్తూ కొంతమంది మేధావులు జనాలను భయపెట్టి చంపుతుంటారు. ఎంతమంది ఏమన్నా కానీ దయ్యం ఉంది అని నమ్మేవాళ్ళు చాలా మంది ఉంటారు. దయ్యానికి సంబంధించిన వీడియోలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు.
కొన్నిసార్లు మనుషుల ప్రమేయం లేకుండానే విచిత్రంగా కొన్ని సంఘటనలు జరుగుతాయి. ఒక గదిలో ఎవరూ లేకపోయినా కొన్ని వస్తువులు వాటంతటవే కదిలిపోతుంటాయి. అక్కడ ఎవరూ లేరు కద సార్ అని మేధావులు కొట్టిపడేసినా.. ఖచ్చితంగా దయ్యమే అని కొందరు బాగా ప్రచారం చేస్తారు. ఇలాంటి వీడియోలు చాలానే వచ్చాయి. దీంతో దయ్యం అని వీడియోలని వైరల్ చేసేస్తుంటారు. తాజాగా ఇలాంటి వీడియోనే ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అర్జెంటీనాలోని బ్యూనస్ ఎయిర్స్ సిటీలో ఉన్న ఒక ప్రైవేట్ హాస్పిటల్ లో.. సెక్యూరిటీ సిబ్బంది ఒక కనిపించని రోగితో మాట్లాడుతున్నాడు. అప్పటి వరకూ రిసెప్షన్ లో కూర్చుని ఉన్న సిబ్బందికి.. ఎంట్రన్స్ డోర్ తెరుచుకోగానే లేచి కొంచెం ముందుకు వెళ్తాడు. అక్కడ పేషెంట్ (కొంతమంది దృష్టిలో దయ్యం) వచ్చినట్టు.. రిజిస్టర్ లో రాసుకుంటాడు. ఆ తర్వాత ఆ రోగిని వీల్ చైర్ లో కూర్చోమని చెప్పి డాక్టర్ క్యాబిన్ లోకి తీసుకెళ్లబోతాడు.
ఇదంతా సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. అయితే ఇది జరగక ముందు రోజు ఒక మహిళా రోగి చనిపోయిందని, ఆమె పేరు మీదనే సెక్యూరిటీ సిబ్బంది రిజిస్టర్ చేశాడని అర్జెంటీనా మీడియా పత్రికలు కథనాలు రాసుకొచ్చాయి. దీంతో చనిపోయిన రోగి దయ్యమై వచ్చిందని కొంతమంది ప్రచారం చేశారు. కొంతమంది మాత్రం సెక్యూరిటీ సిబ్బందికి భ్రమ కలిగి ఉంటుందని అంటున్నారు. మరి ఎంట్రన్స్ డోర్ ఎలా తెరుచుకుందమ్మా.. ఎవరో అటుగా వస్తే తప్ప తెరుచుకోని డోర్ ఆటోమేటిక్ గా ఎలా తెరుచుకుంటుంది? అని ప్రశ్నించే అమాయకులు ఉంటారుగా. వారికి.. హాస్పిటల్ మీడియా రిలేషన్స్ డైరెక్టర్ గిలెర్మో కాపియా బాంబు పేల్చారు. ఎంట్రన్స్ డోర్ సమస్య కారణంగా.. 10 గంటల వ్యవధిలో అది 28 సార్లు తెరుచుకుందని, ఆ పది గంటల వ్యవధిలో అర్థరాత్రి కూడా ఉందని అన్నారు.
ఇక సెక్యూరిటీ సిబ్బంది కనిపించని రోగిని ఆహ్వానించడం, రిజిస్టర్ లో ఆమె పేరు ఎంటర్ చేయడం ఇదంతా ఒక కామెడీ సీన్ అని మిగతా హాస్పిటల్ సిబ్బంది అన్నారు. దీంతో కొంతమంది నెటిజన్లు.. ‘అది మేటర్.. ఈ కాలంలో కూడా దయ్యాలు, భూతాలు అంటారేంట్రా’ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘అంటే ఏంటి? పూర్వం దయ్యాలు ఉన్నాయనా? అర్థం. పోరా బొకడా’ అని మరికొందరు నెటిజన్స్ కౌంటర్లు వేస్తున్నారు. దయ్యం అనేది ఒక భ్రమ, భయం అంతే. కొంతమందికి కనిపించే ఆ దయ్యం (భ్రమ) ఒకప్పుడు మనిషే కదా. మనిషిగా ఉన్నప్పుడే ఏం చేయనోడు చచ్చి ఏం చేయగలడు. వివేకంతో ఆలోచించండి. ఆలోచించి అడుగేయండి.
Spine-chilling moment a ‘#ghost patient’ is greeted by hospital worker on #CCTV and escorted to ‘her’ room – as the employee learns the only patient by the supposed name DIED the day before Buenos Aires, #Argentina pic.twitter.com/oR9FWCqpQv
— 6IX WORLD NEWS (@6ixworldnews) November 24, 2022