శృంగార వీడియోల బిజినెస్‌ది ప్రపంచ వ్యాప్తంగా చాలా పెద్ద మార్కెట్. ప్రతి ఏటా బిలియన్ డాలర్ల వ్యాపారం జరుగుతూ ఉంటుంది. శృంగార తారలుగా టాప్‌లో ఉన్నవారు కోట్ల రూపాయలు సంపాదిస్తూ ఉంటారు.
సాధారణంగా చేసే పనినే దైవంగా భావించే వారు ఉంటారు. కానీ, దేవుడు చెప్పాడని ఓ పనిని ఎంచుకునే వారు.. అది కూడా అందరూ అసహ్యించుకునే పనిని ఎంచుకునే వారు అత్యంత అరుదుగా ఉంటారు. అలాంటి వారిలో కర్టనీ టిల్లియా ఒకరు. ఆమె దేవుడు చెప్పాడని శృంగార తారగా మారింది. శృంగారం ద్వారా దేవుడి సేవ చేసుకుంటున్నానని అంటోంది. ఇంతకీ సంగతేంటంటే.. అమెరికాలోని కాలిఫోర్నియాకు చెందిన కర్టనీ టిల్లియా కొన్నేళ్ల ముందు వరకు ఓ స్కూల్లో టీచర్‌గా పని చేసేది. అయితే, పిల్లలకు చదువు చెప్పడంలో ఆమెకు సంతోషం కలగలేదు.
అందులో ఆత్మ సంతృప్తి లేదని ఆమె భావించింది. దేవుడ్ని బాగా నమ్మే ఆమె తను టీచర్‌గా ఉండటం వల్ల దేవుడికి దూరం అవుతున్నానని అనుకుంది. ఈ నేపథ్యంలోనే ఆమె ఓ ఆలోచన చేసింది. చదువు చెప్పటం మానేసి శృంగార తారగా మారిపోయింది. శృంగార తారగా ఉన్న కొత్తలో ఆమెకు భయంగా ఉండేది. ఎవరు ఏమనుకుంటారో అని సతమతమయ్యేది. ఈ నేపథ్యంలోనే ఆమెకు దేవుడినుంచి ఓ మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ చదివిన తర్వాత అన్ని అనుమానాలను పక్కన పెట్టింది. పూర్తిగా శృంగార వీడియోలు చేయటంలో మునిగిపోయింది. అందులోనే ఆనందం వెతుక్కుంటోంది.
దీనిపై కర్టనీ టిల్లియా మాట్లాడుతూ.. ‘‘ నేను శృంగార తార అవ్వటానికే పుట్టానని దేవుడు స్పష్టంగా చెప్పాడు. ఇది దేవుడి సేవ చేసుకునే ఓ మార్గం. శృంగార వీడియోలు చేయటం దేవుడికి వ్యతిరేకం కాదు. శృంగారం మనల్ని దేవుడి నుంచి వేరు చేసేది కాదు. ఇది ఎంతో పరమ పవిత్రమైనది. నేను ఇప్పుడు దేవుడితో ఎంతో దగ్గరగా ఉన్నాను’’ అని చెప్పుకొచ్చింది. మరి, దేవుడి కోసం, దేవుడ్ని సేవించటం కోసం శృంగార తారగా మారానని అంటున్న కర్టనీ టిల్లియాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.