డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం వల్లనే ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. జరిమానాలు వేస్తున్నప్పటికీ, పోలీస్ కేసులు అయినప్పటికీ వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు.
ఇటీవల ప్రపంచ వ్యాప్తంగా రోడ్డు ప్రమాదాల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్నాయి. ప్రతిరోజూ ఎక్కడో అక్కడ పదుల సంఖ్యల్లో రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయి. డ్రైవర్ల నిర్లక్ష్యం, అతి వేగం, మద్యం సేవించి వాహనాలు నడపడం.. కొన్నిసార్లు నిద్రలేమి వల్ల ఇలాంటి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు చెబుతున్నారు. రోడ్డు భద్రతా చర్యలు ఎంత కఠినతరం చేస్తున్నా.. డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహిస్తున్నా.. జరిమానాలు వేస్తున్నప్పటికీ వీరిలో మార్పు రావడం లేదని అంటున్నారు. ఒక కారు డ్రైవర్ టోల్ బూత్ పై అత్యంత వేగంగా దూసుకు రావడంతో పెద్ద ప్రమాదం జరిగింది.. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా వచ్చినప్పటి నుంచి ఎన్నో రకాల వీడియోలు క్షణాల్లో వైరల్ అవుతున్నాయి. మనం ఎప్పుడూ చూడనటువంటి దృశ్యాలు సోషల్ మీడియా పుణ్యమా అని చూస్తున్నాం. తాజాగా చీలీ నగరంలో పురాంక్ లో ఓ కారు డ్రైవర్ బీభత్సం సృష్టించాడు. పురాంక్ లోని టోల్ బూత్ పై అతి వేగంగా డ్రైవింగ్ చేస్తూ వచ్చిన 21 ఏళ్ల కుర్రాడు అక్కడిక్కడే మృతి చెందాడు. టోల్ బూత్ వద్ద ఉన్న సీసీ కెమెరాల్లో ఈ దృశ్యాలు రికార్డు అయ్యాయి.
వీడియోల కనిపిస్తున్న దృశ్యాల ప్రకారం.. కారు అతి వేగంగా దూసుకు వచ్చి నేరుగా క్రాష్ బారియార్ లోకి వెళ్లిన తర్వా ఎలా ధ్వంసం, ఎలా నిప్పులు చెలరేగాయో కనిపిస్తున్నాయి. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ప్రస్తుతం నెట్టింట ఈ హారిబుల్ యాక్సిడెంట్ కి సంబందించిన వీడియో తెగ వైరల్ అవుతుంది. దీనిపై నెటిజన్లు రక రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు.
Watch! A Speeding Car Crashed Into A Tollbooth In The Chilean City Of Purranque.#TNShorts pic.twitter.com/ULuy8NYHSe
— TIMES NOW (@TimesNow) March 6, 2023