నాలా ఏడు వేల మంది బాయ్‌ఫ్రెండ్స్‌ను సంతోష పెట్టడానికి నిత్యం ఏదో ఒకటి చేస్తూ ఉంటుంది. వాళ్లు నాలాతో ఎంతో ఫ్రీగా మాట్లాడుతూ ఉంటారు. తమ విషయాలు ఆమెతో షేర్ చేసుకుంటూ ఉంటారు.
మగకావచ్చు.. ఆడకావచ్చు.. సాధారణంగా ఎవరికైనా ఓ లవర్ ఉండటం పరిపాటి. కానీ, మోసం చేసే బుద్ది ఉన్న వాళ్లకు ఎక్కువ మంది లవర్స్ ఉంటూ ఉంటారు. అలాంటి వారు ఒకరికి తెలియకుండా మరొకరిని మేయిన్‌టేన్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీలో మాత్రం అంతా విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే మన స్టోరీలోని యువతి దాదాపు 7 వేల మంది బాయ్ ఫ్రెండ్స్‌ను మేయిన్‌టేన్ చేస్తోంది. ఆమెకు అంతమంది బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారని వారందరికీ తెలుసు. అయినా ఆమెతో లవ్‌ను కొనసాగిస్తున్నారు. ఇంతకీ సంగతేంటంటే… అమెరికా, కాలిఫోర్నియాకు చెందిన నాలా రే అనే 25 ఏళ్ల యువతి ఓన్లీ ఫ్యాన్స్ అనే అడల్ట్ సైట్‌లో ఓ అకౌంట్ క్రియేట్ చేసుకుంది.
తనకు సంబంధించిన కొన్ని ప్రైవేట్ ఫోటోలు, వీడియోలు ఆమె తన అకౌంట్‌లో షేర్ చేస్తూ ఉంటుంది. నాలా ఓన్లీ ఫ్యాన్స్ అకౌంట్‌కు దాదాపు 7 వేల మంది ఫాలోవర్స్ ఉన్నారు. వీరందరికీ నాలా అంటే చాలా ఇష్టం. అందుకే ఆమెకు తరచుగా గిఫ్ట్స్ పంపిస్తూ ఉంటారు. అలా నెలకు 2 కోట్లకు పైగా సంపాదిస్తోంది. అంతేకాదు! బోరు కొట్టినపుడు వాళ్లు నాలాతో చాట్ చేస్తూ ఉంటారు. దీనిపై నాలా మాట్లాడుతూ.. ‘‘నేను ప్రతీరోజూ నా బాయ్‌ఫ్రెండ్స్‌ను సంతోషపెట్టే ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేస్తూ ఉంటాను. వారిలో కొందరు నాతో మాట్లాడుతూ ఉంటారు. వాళ్లు వారి జీవితం గురించి చెబుతుంటారు. వారి జీవితంలోని ప్రతీ రోజు ఎలా గడుస్తుందో చెబుతుంటారు. ఎలా నిద్రపోతారో కూడా చెబుతుంటారు. ఒకరకంగా చెప్పాలంటే ఓ రిలేషన్‌లో ఉన్నపుడు ఎలా చేస్తారో అలానే ఉంటుంది.
నాకు ఈ రిలేషన్స్‌ను చూస్తుంటే గర్వంగా ఉంది. నేనే వాళ్ల ఆన్‌లైన్ గాళ్‌ఫ్రెండ్‌ను. నాకు రెండు ఛాయిస్‌లు ఉన్నాయి. మొదటిది.. బయట ఓ అబ్బాయితో డేటింగ్ చేయటం. బయట డేటింగ్ చేసే అబ్బాయికి నా విషయం తెలిస్తే తట్టుకోలేడు. నా సంపాదనను చూసి కుళ్లుకుంటాడు. రెండోది.. ఆన్‌లైన్‌లోనే ఓ అబ్బాయితో డేటింగ్ చేయటం. గతంలో నేను పలు బ్రేకప్స్‌కు గురయ్యాను. ఎందుకంటే నాకు స్వేచ్ఛ ముఖ్యం. నా స్వేచ్ఛను వాళ్లు తట్టుకోలేకపోయేవారు. విడిపోయేవాళ్లం. ఇప్పుడు నేను ఓ బాయ్‌ఫ్రెండ్‌ను సెలెక్ట్ చేసుకుంటే.. ఓన్లీ ఫ్యాన్స్‌నుంచి బయటకు రావాల్సి ఉంటుంది. నేను ఆ 7వేల మందితో పెంచుకున్న బంధం నాకు చాలా ముఖ్యం. వారికి అవసరం అయినపుడు నేను వాళ్లకోసం ఉంటానని వారికి తెలుసు. నన్ను నన్నులా ప్రేమించే వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నాను. అది చాలా కష్టమైన పనిగా మారింది’’ అని చెప్పుకొచ్చింది. మరి, 7 మంది ఆన్‌లైన్ బాయ్‌ఫ్రెండ్స్ ఉన్న నాలాపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.