ఈ మధ్య కాలంలో సినీ, వ్యాపార రంగాల్లో ఉన్న ప్రముఖులు ఒక్కరొక్కరుగా విడాలకులు తీసుకుంటున్నారు. కొన్నాళ్లు పాటు సహజీవనం చేస్తూ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ కలిసి మెలిసి ఉంటారు. ఆ తర్వాత కొన్ని ఏళ్ల తర్వాత మళ్లీ విడిపోతారు. అయితే తాజాగా బిలియనీర్ బిల్ గేట్స్ ఆయన భార్యమెలిండా ఫ్రెంచ్ గేట్స్ విడాకులు తీసుకున్నట్లు ప్రకటించారు. తమ 27 ఏళ్ళ వైవాహిక బంధానికి వారు స్వస్తిపలికారు. గతంలో విడాకులు తీసుకుంటామని చెప్పినా తాజాగా ఎట్టకేలకు అధికారికంగా ప్రకటించటం విశేషం.
బిల్‌గేట్స్ తన విడాకుల ప్రకటనలో వాషింగ్టన్ లోని కింగ్ కౌంటీ జడ్జి వీరికి నిన్న విడాకులు మంజూరు చేశారు. కాగా నేడు అధికారికంగా విడాకులు తీసుకోబుతున్నట్లు వారు ప్రకటించారు. ఇటీవల బాలీవుడ్ స్టార్ కపుల్స్ అమీర్‌ఖాన్ దంపతులు కూడా విడాకులు తీసుకన్న విషయం తెలిసిందే. కొ్న్నాళ్ల పాటు వీరు కూడా సహజీవనం చేసి విడాకులు తీసుకుంటున్నామంటూ ఇటీవల ప్రకటించారు. రూ.300 కోట్ల డాలర్ల విలువైన షేర్లను గేట్స్ కాస్గెడ్ ఇన్వెస్ట్ మెంట్ అప్పుడే ఫ్రెంచ్ గేట్స్ కి బదిలీ చేసినట్టు ప్రచారం మాత్రం జరుగుతోంది.
బిల్ గేట్స్ కి 150 మిలియన్లకు పైగా ఆస్తులు, సంపాదన ఉన్నాయి. ఇక వీరి ధార్మిక సంస్థ బిల్ గేట్స్ ఫౌండేషన్ తదితర అంశాలపై మాత్రం ఇంత వరకు ఎలాంటి ప్రకటన చేయలేదు. మరి ఆస్తుల అంశాల్లో చెరి సగం పంచుకుంటారని వార్తలు వినిపిస్తున్నాయి. జడ్జీలు మాత్రం వారి సంపదనో ఇద్దరు పంచుకోవాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది.