పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ పర్వతాలపై నివసించే హంజా తెగకు చెందిన మహిళలు వన్నె తరగని అందానికి వృద్ధాప్యం పైబడుతున్నా తరిగిపోని ఉత్సాహానికి చిరునామాగా నిలుస్తున్నారు. అందుకే ప్రపంచంలోనే అత్యంత అందగత్తెలుగా, ఎక్కువ కాలం జీవించే వ్యక్తులుగా పేరుగాంచారు ఇక్కడి ప్రజలు. పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని గిల్గిత్-బాల్టిస్తాన్ పర్వతాలపై నివసించే హంజా తెగ వారికి బురుషా తెగ అనే పేరు కూడా ఉంది. వయసుతో పాటు యవ్వనాన్ని, చురుకుదనాన్ని పెంచుకుంటూ పోయే ఈ ప్రజల జీవనశైలే వారి అందానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణంగా చెప్పచ్చు. ఈ క్రమంలో వండినవి, ప్రాసెస్ చేసినవి అస్సలు ముట్టుకోరట. ఇక్కడి ప్రజలు ఎక్కువగా పండ్లు, పచ్చి కాయగూరలు తీసుకోవడానికి ఇష్టపడతారు. ముఖ్యంగా పాలు, పెరుగు, బార్లీ,బక్ వీట్, గోధుమలు, మొలకెత్తిన గింజలు, ఎండు ఆప్రికాట్స్ వంటివి ఇక్కడి ప్రజల ప్రధానాహారంగా చెప్పుకోవచ్చు. అలాగే హిమానీనదాల నుంచి వచ్చే స్వచ్ఛమైన నీటిని తాగడం వల్ల కూడా వీరు ఎలాంటి అనారో బారిన పడకుండా ఉంటున్నారు రోజుకు రెండు పూటలు మాత్రమే. అంటే మధ్యాహ్నం 12 గంటలకు అల్పాహారం, ఆపై రాత్రి భోజనం.. రోజూ ఇవే మెనూ టైమింగ్స్ ని ఫాలో అవుతారట హంజా ప్రజలు. అయితే ఏడాదిలో మూడు నాలుగు నెలల పాటు నిరంతరాయంగా ఉపవాస దీక్ష చేపడతారట వారు. పైగా దీన్ని ఆచారంగా పాటిస్తుంటారు కూడా! అందుకే ఉపవాసం చేయడం ఆ సమయంలో ఆప్రికాట్ పండ్ల రసాన్ని తీసుకోవడం అనేది చిన్నతనం నుంచే మొదలు పెడతారట అక్కడి ప్రజలు!
వయసు పెరుగుతున్నా ఎంతో చురుగ్గా ఉండడంతో పాటు ఎలాంటి అనారోగ్యాల బారిన పడకుండా సగటున 120 ఏళ్లు ఆనందంగా, ఆరోగ్యంగా తమ జీవితాన్ని ఆస్వాదిస్తుంటారట హంజా తెగ వారు. అందులో ఒకటే ‘సాల్టీ టీ. తుమురు అనే మూలికతో తయారుచేసే ఈ టీ తాగడం వల్ల నవయవ్వనంగా మెరిసిపోతుంటారు. ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లకు చాలా వరకు దూరంగా ఉండే ఇక్కడి ప్రజలు పీల్చే గాలి కూడా ఎంతో స్వచ్ఛమైనది. ఎప్పుడూ పర్యావరణాన్ని పరిశుభ్రంగా ఉంచుకుంటూ, ప్రకృతిలోని పచ్చదనాన్ని ఆస్వాదిస్తూ ప్రకృతిని మనం ప్రేమిస్తే.. అదీ మనల్ని ప్రేమిస్తుంది.. సంపూర్ణ ఆరోగ్యాన్ని అందిస్తుంది.!’ అని తమ ఆరోగ్యకరమైన పెంచుకుంటూ పోయే ఈ ప్రజల జీవనశైలే వారి అందానికి, ఆరోగ్యానికి ముఖ్య కారణంగా చెప్పచ్చు.