అమెరికాకు చెందిన మోనికా హల్డట్-జాన్ భార్యా భర్తలు. తన భర్త జాన్ ను పరాయి స్త్రీల దగ్గరకు తానే స్వయంగా పంపుతాను అని చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగితే.. ఆసక్తికర సమాధానం చెప్పింది.
భారతీయ సనాతన సంప్రదాయ వ్యవస్థలో వివాహానికి గొప్ప స్థానం ఉంది. అయితే అన్ని దేశాల్లో ఇలాంటి సంప్రదాయాలు, ఆచారాలు, సంస్కృతులు ఉండవు. అయితే నేటి ఆధునిక కాలంలో భారతదేశంతో పాటుగా ఇతర దేశాల్లో కూడా ఇలాంటి పద్దతులు ఆచరించేవారు ఉన్నారా? అంటే ఆన్సర్ చెప్పడానికి కాస్త ఆలోచించాల్సిందే. అయితే మహిళలు దేన్నైనా క్షమిస్తారు కానీ.. తన భర్త పరాయి స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడు అని తెలిస్తే మాత్రం అస్సలు సహించదు. అయితే ఓ మహిళ మాత్రం అచ్చం సతీ సుమతి లాగా తన భర్తను వేరే మహిళలతో గడిపి రమ్మని సాగనంపుతోంది. ఈ వార్త వినడానికి ఆశ్చర్యకంగా ఉన్నా.. నిజం. అయితే ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని ఆ భార్యామణిని అడిగితే.. ఆసక్తికరమైన ఆన్సర్ చెప్పుకొచ్చింది. మరి ఈ విచిత్రమైన సంఘటనకు సంబంధించి మరిన్ని వివరాల్లోకి వెళితే..
పరాయి స్త్రీకి లోలుడైన కౌశికుడు ఓ వేశ్యను చూసి మనసు పారేసుకుంటాడు. అప్పటి నుంచి ఆ వేశ్య దగ్గరకు తీసుకెళ్లమని భర్య సతీ సుమతిని వేధించేవాడు. దాంతో ఓ రోజు తన భర్తను ఆ వేశ్య దగ్గరకు తానే స్వయంగా తీసుకెళ్తుంది. ఇది భారతీయ పురాణాల్లో ఉన్న ఓ కథ. ఇప్పుడు మనం చెప్పుకోబోయే స్టోరీ కూడా అచ్చం ఇలాంటిదే. అమెరికాకు చెందిన మోనికా హల్డట్-జాన్ భార్యా భర్తలు. తన భర్త జాన్ ను పరాయి స్త్రీల దగ్గరకు తానే స్వయంగా పంపుతాను అని చెప్పి అందరిని షాక్ కు గురిచేసింది. ఇలా ఎందుకు చేస్తున్నావ్ అని అడిగితే..
“తన భర్తకు ఎలాంటి అవసరాలు ఉన్నాగానీ వాటిని తీర్చడం నా ప్రాథమిక విధి. ఇక ఇతర మహిళలతో గడపటానికి తన భర్తను అనుమతించటం వల్ల మా ఇద్దరి మధ్య అనుబంధం ఇంకా ఎక్కువ అవుతుంది. ఇక తాను ఎలాంటి బట్టలు వేసుకుంటే జాన్ కు నచ్చుతుందో అలాంటి బట్టలే ఇంట్లో వేసుకుంటాను. నేను ఇంట్లో మేకప్ వేసుకోవడం జాన్ కు నచ్చదు. చివరిగా అతడికి నచ్చినట్లు ఉండటమే నా పని” అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇంట్లో పని చేసేటప్పుడు జాన్ వల్ల ఎలాంటి ఇబ్బంది కలగకుండా.. అతడిని పరాయి స్త్రీల దగ్గరకి దూరంగా పంపుతాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది మోనికా.
ఇక నా పని పూర్తి అయిన తర్వాతనే జాన్ ఇంటికి వస్తాడు అంటూ చెప్పుకొచ్చింది మోనికా హల్డట్. దాంతో ఈ విషయం తెలిసిన వారందరు నువ్వు ఆధునిక సతీ సుమతివి అంటూ కామెంట్స్ చేస్తున్నారు. మరికొంతమంది నెటిజన్లు నీ భర్త అదృష్టవంతుడు అని సరదాగా కామెంట్స్ చేస్తున్నారు. మరి పరాయి స్త్రీల దగ్గరకు మోనికా హల్డట్ తన భర్తను పంపించడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.