‘మిన్నల్ మురళి’ నెట్ ఫ్లిక్స్ లో విడుదలై.. మళయాలం స్టార్ థామస్ సూపర్ హీరోగా నటించిన చిత్రం ఇది. దాంట్లో హీరోపై పిడుగుపడి సూపర్ పవర్స్ వస్తాయి. అందరూ అదెలా సాధ్యం అనుకుంటున్నారా? అయితే ఇప్పుడు అదే రియల్ లైఫ్ లో కూడా జరిగింది. అవునండి పిడుగుపాటుకు గురైన ఒక వ్యక్తి నిజంగానే ప్రాణాలతో బయటపడ్డాడు. అయితే సూపర్ పవర్స్ ఏమీ రాలేదు. అతని ప్రాణాలు మాత్రం మిగిలాయి. అందరూ అతడిని మృత్యుంజయుడు అంటూ తెగ పొగిడేస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఇది జరిగింది ఇండియాలో కాదులెండి. ఇండోనేషియాలో ఈ ఘటన జరిగింది. జకార్తాలోని ఓ ప్రాంతంలో భారీగా వర్షం కురుస్తోంది. వర్షంలో ఓ వ్యక్తి గొడుగు పట్టుకుని నడుస్తూ ఉన్నాడు. ఒక్కసారిగా అతనిపై పిడుగు పడింది. అందరూ ఒక్కసారిగా షాక్ అయ్యారు. చుట్టుపక్కల ఉన్న వారు పరుగున వెళ్లి అతడిని ఆస్పత్రికి తరలించారు. అయితే అతను కొద్దిపాటి గాయాలతో బయటపడినట్లు అక్కడి మీడియా తెలిపింది. అతనికి ప్రాణాపాయం తప్పినట్లు వెల్లడించింది. అందుకే అందరూ ఇప్పుడు అతడిని రియల్ లైఫ్ మిన్నల్ మురళి అంటూ చెప్పుకుంటున్నారు. ఆ వైరల్ వీడియో మీరూ చూసేయండి. ఈ ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
Real Life #MinnalMurali Survived From A Thunder Boult How Lucky! pic.twitter.com/2G1mQySMCB
— tiru (@tiru9676) December 27, 2021