2 KG Dumbbell Found In Man Rectum: ఈ ప్రపంచంలో వింతవింత జంతువులు ఉన్నట్లే.. మనుషులు కూడా ఉంటారు. వారి ప్రవర్తన అందరికంటే భిన్నంగా ఉంటుంది. వారి ప్రవర్తనతో.. చేష్టలతో ఎదుటి వారి మతి పోగొడుతుంటారు. తాజాగా, ఓ వ్యక్తి చేసిన పనికి అతడికి వైద్యం చేసిన డాక్టర్లు.. యావత్ ప్రపంచమే ఆశ్చర్యపోయింది. తన ప్రైవేట్ పార్టులో డంబెల్‌ను తోసుకుని డాక్టర్ల మతి పోగొట్టాడు. దాన్ని బయటకు తీయటానికి తీవ్రంగా ప్రయత్నించిన డాక్టర్లు చివరకి విజయం సాధించారు. వివరాల్లోకి వెళితే.. బ్రెజిల్‌లోని మానాస్‌కు చెందిన 54 ఏళ్ల వ్యక్తి కొద్దిరోజుల క్రితం బలవంతంగా తన ప్రైవేట్ పార్టులోకి రెండు కిలోల బరువైన డంబెల్‌ను తోసుకున్నాడు.
ఏం చేయాలో తెలియక రెండు రోజులు అలానే ఉండిపోయాడు. కడుపులో నొప్పి పెరిగిపోవటంతో మానాస్‌లోని ఆసుపత్రికి వెళ్లాడు. కడుపులో నొప్పి, వాంతికి వచ్చినట్లు ఉందని, మలానికి కూడా వెళ్లలేకపోతున్నానని వైద్యులకు చెప్పాడు. అతడి ప్రైవేట్ పార్టును పరీక్షించిన వైద్యులు అక్కడ ఎలాంటి ప్రాబ్లమ్ లేదని గుర్తించారు. అనంతరం ఎక్స్‌రే తీయించుకోవాలని అతడికి చెప్పారు. అతడు దానికి ఒప్పుకోలేదు. ఎక్స్ రే తీయించుకోనని మొండికేశాడు. వారు బలవంతం చేయడంతో తప్పక ఎక్స్ రే తీయించుకున్నాడు. ఆ ఎక్స్‌రేను చూసిన డాక్టర్లు షాక్ అయ్యారు.
అతడి కడుపులో 2కిలోల బరువైన, 20 సెంటీమీటర్ల డంబెల్ ఉన్నట్లు కనుగొన్నారు. పరికరాలతో దాన్ని బయటకు తీయటానికి చేసిన ప్రయత్నాలు విఫలమయ్యాయి. దీంతో ఓ డాక్టర్ తన చేతికి పని చెప్పాడు. తన చేతిని బలవంతంగా లోపల పెట్టి డంబెల్‌ను బయటకు తీశాడు. మూడు రోజులు ఆసుపత్రిలో చికిత్స అనంతరం బాధితుడు ఇంటికి వెళ్లిపోయాడు. శృంగార పరమైన ఆలోచనల కారణంగానే ఆ వ్యక్తి అలా చేశాడని వైద్యులు తెలిపారు. 20-40 సంవత్సరాల వయసు కలిగిన తెల్ల జాతి పురుషులు ఎక్కువగా తమ ప్రైవేట్ పార్టుల్లో ఇలా వస్తువుల్ని తోసుకుంటూ ఉంటారని వెల్లడించారు. మరి, ఈ వింత సంఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
ఇవి కూడా చదవండి : చాక్లెట్ కోసం బాలుడి సాహసం.. టైమ్ బాగోక జైలుకు!
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.