ఇండియాలో క్రికెట్ కి ఉన్నంత ఆదరణ ఇతర ఏ క్రీడకి లేదు. ఒక్కసారి క్రికెటర్ అయితే చాలు.., జీవితంలో ఊహించనంత డబ్బు వచ్చి పడుతుంది. అయితే.., ఇదంతా నాణేనికి ఒకవైపు మాత్రమే. క్రికెట్ లో కాసులు కురిసేది కేవలం పురుషుల జట్టు వరకే. మిగతా క్రికెటర్స్ పరిస్థితి ఇంకా దారుణంగానే ఉంది. ఇక బ్లైండ్ క్రికెట్ లో మన దేశానికి వరల్డ్ కప్ సాధించి పెట్టిన వారిని ఇప్పుడు పట్టించుకునే నాధుడే కరువయ్యారు. దీంతో.., 2018లో జట్టు వరల్డ్ కప్ సాధించడంలో కీ రోల్ పోషించిన నరేష్ తుమ్డా అనే ప్లేయర్ ఇప్పుడు రోజువారీ కూలీగా జీవించాల్సిన పరిస్థితి ఏర్పడింది.
నరేష్ తుమ్డా గుజరాత్ కి చెందిన ఆటగాడు. కంటిచూపు సరిగ్గా లేకపోయినా.., అతను చిన్ననాటి నుండి ఆట మీద ఇష్టాన్ని వదులుకోలేదు. పట్టుదలతో సాధన చేసి.., నేషనల్ బ్లైండ్ టీమ్ కి సెలెక్ట్ అయ్యాడు. ఆ ఆటలో కొన్ని రికార్డ్స్ కూడా క్రియేట్ చేశాడు. ఇక 2018లో జరిగిన వరల్డ్ కప్ లో సిరీస్ అంతా నరేశ్ ఆకట్టుకున్నాడు. నిజానికి ఇదే పర్ఫర్మెన్స్ మెయిన్ టీమ్ లో ఎవరైనా చేస్తే.. ఈ పాటికి వాళ్ళు కోటీశ్వరులు అయిపోయి ఉండేవారు. కానీ.., నరేశ్ కి మాత్రం అదృష్టం కలసి రాలేదు.
ఆట నుండి రిటైర్డ్ అయ్యాక తనకి ఏదైనా ఉద్యోగం ఇప్పించమని నరేశ్ ప్రభుత్వాల చుట్టూ తిరిగాడు. బీసీసీఐ నుండి గాని, గుజరాత్ క్రికెట్ అసోసియేషన్ నుండి గాని ఏదైనా సహాయం అందుతుందని తెగ ప్రయత్నాలు చేశారు. కానీ.., ఒక్కరు సహాయం చేయలేదు. గుజరాత్ ముఖ్యమంత్రిని సైతం మూడుసార్లు కలిసినా.., నరేశ్ కి అదృష్టం కలసి రాలేదు. దీంతో.., బతుకు బండిని ముందుకి నడిపించడానికి నరేశ్ రోజువారీ కూలీగా మారాడు. రోజుకు కేవలం 250 రూపాయలు సంపాదనతో అరకొర జీవితాన్ని అనుభవిస్తున్నాడు. ఇప్పటికైనా తన కుటుంబ పోషణకోసం ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాడు నరేశ్. కనీసం ఇప్పటికైనా బీసీసీఐ బాస్ గంగూలీ కలుగచేసుకుని.. నరేశ్ కి ఏమైనా సహాయం అందిస్తాడేమో చూడాలి. మరి.. ఓ మాజీ క్రికెటర్ కి ఈ స్థితి రావడంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి.
Gujarat: Naresh Tumda, part of team that helped India win 2018 Blind Cricket World Cup, now works as a labourer in Navsari to earn livelihood
“I earn Rs 250 a day. Requested CM thrice but didn’t get reply. I urge govt to give me job so that I can take care of my family,” he said pic.twitter.com/NK4DFO6YYC
— ANI (@ANI) August 8, 2021