స్వల్పంగా పెరిగిన బంగారం ధర
10గ్రా 22 క్యారెట్ 200 రూపాయలు పెరిగింది
10గ్రా 24 క్యారెట్ 220 రూపాయలు పెరిగింది
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,450.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,490.
1కిలో వెండి 67,700
బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా పెరిగాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 20 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 22 రూపాయలు పెరిగింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 200 రూపాయలు పెరిగి 44 వేల 450 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 220 రూపాయలు పెరిగి 48 వేల 490 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి కిలో 1000 రూపాయలు పెరిగింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 700 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 480 రూపాయలు పెరిగింది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 440 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 850 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,930 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,270 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,270 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,410 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,630 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.