స్వల్పంగా పెరిగిన బంగారం ధర, భారీగా తగ్గిన వెండి ధర, 10గ్రా 22 క్యారెట్ 150 రూపాయలు తగ్గింది, 10గ్రా 24 క్యారెట్ 160 రూపాయలు తగ్గింది., 22 క్యారెట్ 10గ్రా బంగారం 44,300., 24 క్యారెట్ 10గ్రా, బంగారం 48,330., 1కిలో వెండి 68,400
బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్ గ్రాము 15 రూపాయలు తగ్గింది. 24 క్యారెట్ గోల్డ్ ధర కూడా గ్రాముకు 16 రూపాయలు తగ్గింది. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 150 రూపాయలు తగ్గి 44 వేల 300 రూపాయలు చేరింది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములకు 160 రూపాయలు తగ్గి 48 వేల 330 రూపాయలకు చేరింది. ఇక ఈ రోజు వెండి ధరలో మార్పు లేదు. ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 68 వేల 400 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 160 రూపాయలు పెరిగింది. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 170 రూపాయలు పెరిగింది.
ఇక చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 660 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,720 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 46,490 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 47,490 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,590 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,590 రూపాయలుగా ఉంది. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు.