బంగారం ధరలో మార్పు లేేదు
22 క్యారెట్ 10గ్రా బంగారం 44,010.
24 క్యారెట్ 10గ్రా బంగారం 48,010.
1కిలో వెండి 67,700
బిజినెస్ డెస్క్- ఈ రోజు మంగళవారం బంగారం ధరలో మార్పు లేదు. సోమవారంతో పోలిస్తే 22 క్యారెట్ గోల్డ్, 24 క్యారెట్ గోల్డ్ ధరలో మార్పు లేదు. ఇక హైదరాబాద్ లో ఈరోజు 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 44 వేల 10 రూపాయలు పలుకుతోంది. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 48 వేల 10 రూపాయలుగా ఉంది. ఇక ఈ రోజు వెండి కిలో 500 రూపాయలు తగ్గింది. దీంతో ఈ రోజు మార్కెట్లో వెండి కిలొ 67 వేల 700 రూపాయలు పలుకుతోంది. గత పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాములు 170 రూపాయలు పెరగగా.. 24 క్యారెట్ల బంగారం కూడా 10 గ్రాములు 180 రూపాయలు పెరిగింది.
ఇక దేశవ్యాప్తంగా పలు ప్రధాన నగరాల్లోను బంగారం ధరల్లో మార్పు లేదు. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ బంగారం 44 వేల 480 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములు 48,530 రూపాయలుగా ఉంది. ముంబయిలో 22 క్యారెట్ బంగారం 10 గ్రాములు 45,970 రూపాయులుండగా, 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,970 రూపాయలు పలుకుతోంది. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం 46,160 రూపాయలు ఉండగా, 24 క్యారెట్ 10 గ్రాములు 50,360 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ లో బంగారం దిగుమతులు తగ్గడం బంగారం ధరలపై ప్రభావం చూపుతోందని నిపుణులు అంటున్నారు. రేపు కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు ఉండే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి.