ఫిల్మ్ డెస్క్- మేఘా ఆకాష్.. ఈ కన్నడ సోయగం చేసింది తక్కువ సినిమాలే అయినా మంచి క్రేజ్ సంపాదించుకుంది. మేఘా తెలుగులో హీరోయిన్ గా ‘లై’, ‘ఛల్ మోహన్‌రంగా’ తదితర సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. తెలుగులోనే కాదు కన్నడం, తమిళంలోనూ మేఘా ఆకాష్ నటించి మంచి పెరు తెచ్చుకుంది. తన అందం, అభినయంతో దక్షిణాది ప్రేక్షకులను అలరిస్తోంది మేఘా ఆకాష్.
ఇక మేఘా ఆకాష్ తాజాగా తెలుగులో నటిస్తున్న సినిమా ‘డియర్ మేఘా’. మేఘ ఆకాశ్ జోడీగా అరుణ్ ఆదిత్, అర్జున్ సోమయాజుల నటిస్తున్నారు. అర్జున్ దాస్యం నిర్మాతగా వ్యవహరిస్తున్న డియర్ మేఘాకు సుశాంత్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ మూవీ నుంచి తాజాగా ఒక లిరికల్ వీడియో సాంగ్‌ను విడుదల చేశారు. గుండెల్లో కన్నీటీ మేఘం కమ్మిందా.. తానైతే దూరం.. అంటూ ఆ పాట కొంత ఆవేధనతో సాగుతూ ఇంట్రస్ట్ క్రియేట్ చేస్తోంది.
డియర్ మేఘా సినిమాకు హరి గౌర సంగీతం అందించగా, ఈ పాటను కృష్ణకాంత్ రాశారు. వేదాంశ్ క్రియేటివ్ వర్క్ బ్యానర్‌పై నిర్మితమవుతున్న ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు. డియర్ మేఘా మూవీని నవంబర్ లో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరింకెందుకు ఆలస్యం ఈ సినిమా లిరికల్ సాంగ్ ను మీరు చూసెయ్యండి.