బండ్ల గణేశ్..సినిమాల్లో కమెడియన్. రియల్ లైఫ్ లో మాత్రం స్టార్ ప్రొడ్యూసర్. అంతకు మించి “టెంపర్” ఉన్న మనిషి. అందరు హీరోలతో సినిమాలు చేసే బండ్లకి.. మెగా ఫ్యామిలీ అంటే పిచ్చి అభిమానం. ముఖ్యంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని గణేశ్ దేవుడిలా కొలుస్తూ ఉంటారు. చాలా సినిమాల ఆడియో వేడుకల్లో బండ్ల గణేశ్ ఈ విషయాన్ని చెప్పుకొచ్చారు కూడా. అయితే.., తాజాగా మెగాస్టార్ చిరంజీవి తనకి చేసిన సహాయాన్ని చెప్పుకొస్తూ బండ్ల గణేశ్ ఎమోషనల్ అయ్యారు.
బండ్ల గణేశ్ మాటలు తూటాల్లా పేలుతుంటాయి. ఇందుకే ఆయన్ని ఇంటర్వ్యూ చేయడానికి మీడియా హౌసెస్ అన్నీ ఆసక్తి చూపిస్తుంటాయి. ఈ నేపథ్యంలోనే ఓ వెబ్ మీడియాకి బండ్ల గణేశ్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో బండ్ల చిరంజీవి గొప్ప మనసుని బయట పెట్టాడు. ఈ ఇంటర్వ్యూ ప్రోమోలో ముందుగా మా ఎన్నికల కి సంబంధించిన ప్రశ్నలకు తనదైన శైలి లో సమాధానం ఇచ్చిన బండ్ల.. తరువాత తనకి చిరంజీవి చేసిన సహాయం గురించి చెప్పుకొచ్చాడు.
“నాకు రెండోసారి కరోనా వచ్చిన విషయం మీ అందరికీ తెలుసు. ఆ సమయంలో ఒక్క హాస్పిటల్ లో కూడా నాకు బెడ్ దొరకలేదు. అప్పుడు నా కుటుంబం మొత్తానికి కరోనా వచ్చింది. పవన్ కళ్యాణ్ గారిని సహాయం అడగదాం అనుకుంటే ఆ సమయంలో ఆయన కూడా కరోనాతో ఇబ్బంది పడుతున్నారు. అప్పుడు ఆయన్ని ఇబ్బంది పెట్టడం కరెక్ట్ కాదనిపించింది.
అప్పటికే ఆ నా లివర్ 80 శాతం వరకు పాడైపోయింది. దీంతో.. ఆఖరి ప్రయత్నంగా చిరంజీవి గారికి ఒక్క ఫోన్ కాల్ చేశా. అన్నయ్య ఇది పరిస్థితి అని వివరించా. ఆ ఒక్క కాల్ తో నా కష్టాన్ని తీర్చేశారు. నా వైద్యం కోసం అన్నీ ఏర్పాట్లు నిమిషాల వ్యవధిలో చేసేశారు మెగాస్టార్. ఈరోజు బండ్ల గణేశ్ మీ ముందు కూర్చొని మాట్లాడుతున్నాడు అంటే.. ఇది చిరంజీవి గారు పెట్టిన ప్రాణ బిక్ష అంటూ బండ్ల గణేశ్ ఎమోషనల్ అయిపోయారు. ప్రస్తుతం.. దీనికి సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి.., చూశారు కదా? ఈ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియ చేయండి.