ఫిల్మ్ డెస్క్- సినిమా పరిశ్రమలో అభిమానుల సందడి అంతా ఇంతా కాదు. అందులోను దక్షిణాదిలో హీరోలకు అభిమాన సంఘాలు ఎక్కువ. ఇక తెలుగు సినీ పరిశ్రమలో అభిమానులకు సెంటిమెంట్లు ఎక్కువ. అప్పుడప్పుడు ఒక హీరో అభినులకు, మరో హీరో అభిమానులు మధ్య కొంత మేర మనపస్పర్ధలు కూడా వస్తుంటాయి.
ఇదిగో ఇప్పుడు బాలకృష్ణ అభిమానులు తమిళ నటుడు విజయ్ సేతుపతిపై పెద్ద ఎత్తున ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇందుకు కారణం బాలయ్య సినిమాలో నటించేందుకు విజయ్ సేచుపతి నో చెప్పడమే. అవును బాలకృష్ణ త్వరలోనే గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. వేటపాలెం నేపథ్యంలో సాగే విభిన్నమైన కథతో ఈ సినిమా రూపొందనుందట. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు.
ఈ సినిమాకు సంబందించి ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ కూడా దాదాపు పూర్తికావచ్చిందట. ఈ క్రమంలో ఈ సినిమాలో ఇతర నటీనటుల ఎంపిక జరుగుతోంది. ఈ మేరకు విలన్ క్యారెక్టర్ కోసం విజయ్ సేతుపతిని సంప్రదిస్తే, దానికి ఆయన నో అన్నారని తెలుస్తోంది. ఇంకేముంది బాలయ్య అభిమానులకు కోపం వచ్చేసింది. రెండేళ్ల క్రితం సైరా సినిమాలో చిన్న పాత్రలో నటించిన సందర్బంలో, చిరంజీవిపై ఉన్న ప్రేమతోనే ఈ సినిమా చేశానని చెప్పారు.
మరి ఇప్పుడు బాలయ్య సినిమాలో నటించడానికి విజయ్ సేతుపతి ఎందుకు ‘నో’ చెప్పారని ఫ్యాన్స్ ప్రశ్నిస్తున్నారు. ఐతే బాలకృష్ణ సినిమాలో నటించేందుకు విజయ్ సేతుపతి ఎందుకు నో చెప్పారన్నదానిపై క్లారిటీ లేదు. ఆయన వేరే సినిమాల్లో బిజీగా ఉన్నారా, లేక కధ నచ్చకనా అన్నది తెలియాల్సి ఉంది.