ఆంధ్ర ప్రదేశ్ టూరిజం శాఖ మంత్రి.. అవంతి శ్రీనివాస్ వాహనం ఢీకొని సూర్యనారాయణ అనే వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. అవంతి శ్రీనివాస్ కాన్వాయ్ ఎయిర్ పోర్ట్ నుండి వస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. బైక్ పై వెళ్తున్న సూర్యనారాయణకి మంత్రి వాహనం తగలడంతో అతను కిందపడిపోవడం, ఆ తరువాత వెనకనే వస్తున్న మరో వాహనం అతనిపై నుంచి వెళ్లడం సీసీటీవీ లో రికార్డు అయినట్టు వార్తలు వస్తున్నాయి.మృతుడి బంధువులు జనసేన నేతలతో కలసి మంత్రి ఇంటి ముందు ధర్నాకి దిగారు. దీంతో.. మంత్రి అవంతి ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు.
ఈ విషయం తెలుసుకున్న అవంతి శ్రీనివాస్ స్వయంగా రంగంలోకి దిగి సమస్యపై స్పందించారు.ఈ ఘోర ప్రమాదం జరిగిన సమయంలో వాహనంలో నేను లేను. కానీ.., మృతుడి కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటాము. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు జరుగుతోంది. ఈ లోపు మానవతా దృక్పథంతోనే ఆర్థిక సాయం అందిస్తామని మంత్రి అవంతి స్పష్టం చేశారు. మరోవైపు జనసేన నేతలు మాత్రం మృతుడి కుటుంబానికి రూ.10 లక్షలు ఇవ్వాలని బంధువులు డిమాండ్ చేస్తున్నారు. మరి.. ఏ విషయంలో మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.