బుల్లితెర డెస్క్- సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక ఎక్కడ ఏంజరిగినా అందరికి చేరిపోతోంది. ఇక ఎవరు ఏంచేసినా వెంటనే దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసేస్తున్నారు. ఇక సెలబ్రెటీల విషయం చెప్పక్కర్లేదు. సినిమా వాళ్లు ఏంచేసినా వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం సర్వసాధారణం. ఐతే కొంత మంది సెలబ్రెటీలు చేసే పనులు విమర్శలుకు తావిస్తుంటాయి. ఇదిగో ఓ బుల్లితెర నటి చేసిన పనికి నెటిజన్లు మండిపడుతున్నారు.
ప్రముఖ టీవీ యాంకర్‌గా, బుల్లితెర నటి సమీరా షరీఫ్ తల్లికాబోతోంది. తనకంటే చిన్నవాడైన అన్వర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది సమీరా. అన్వర్ ఎవరో కాదు సీనియర్ నటి సన కుమారుడే. తన మాతృత్వాన్ని ఆస్వాదిస్తూ అందుకు సంబందించిన ఫోటోలను అభిమానులతో పంచుకుంటూ వస్తోంది సమీర. ఈ క్రమంలోనే ఆమె నిండు గర్భిణిగా ఉండి షేర్ చేసిన వీడియోపై నెటిజన్ల నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
నిండు గర్భంతో స్కేటింగ్ సైకిల్‌పై విన్యాసాలు చేస్తున్న ఓ వీడియోను షేర్ చేసింది సమీరా. బాగా ఎత్తుగా ఉన్న ప్రదేశం నుంచి ఆ స్కేటింగ్ సైకిల్‌పై కిందికి వస్తూ వీడియోకి ఫోజులు ఇచ్చింది సమీర. గర్భం అనేది ఒక వ్యాధి కాదంటూ ఈ వీడియోకి క్యాప్షన్ పెట్టింది. గర్భం అనేది ఒక వ్యాధి కాదు.. జీవితంలో అదో అందమైన దశ.. ఇలాంటి దశలో సంతోషంగా ఉండాలి.. దేవుడిపై విశ్వాసం ఉన్నంత వరకూ ఏమీ కాదు.. తనపైన తన శరీరంపైన పుట్టబోయే బిడ్డపైన నమ్మకం ఉంటే ఇలాంటి మిస్టేక్ జరగదు.. మాతృత్వాన్ని పొందుకుంటూ.. ప్రసూతి ఆస్వాదించాలి.. అని చెప్పుకొచ్చింది సమీర.
ఇక సమీర వీడియోపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు. జాగ్రత్త సమీర గారూ.. అసలే గర్భంతో ఉన్నారు.. అని కొంతమంది సూచిస్తే, ఇది మరీ టూమచ్.. ఇన్ని డ్రామాలు అవసరమా.. అని వెటకారం చేస్తున్నారు మరి కొందరు. ఎవరేం చెప్పినా.. ఏం పర్లేదు.. నేను పడిపోను నాకు అలవాటే.. అని కూల్ గా సమాధానం చెబుతోంది సమీరా. ఇప్పుడీ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.