దక్షిణాది చిత్ర పరిశ్రమలో పరిచయం అక్కర్లేని నటుడు నాజర్. విభిన్నమైన పాత్రలతో తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నటించి ఆయనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. స్టార్ హీరోలందరి సినిమాల్లో ఆయన ప్రధాన పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్నారు. నాజర్ లేకుండా ఎలాంటి పెద్ద సినిమా లేదు అనేంతగా ఆయన గుర్తింపు సంపాంచారు. ఇటీవల బాహుబలి సినిమాల్లో అద్భుతమైన నటనతో అభిమానుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు. అయితే ఇటీవల కాలంలో ఆయన సినిమాలు బాగా తగ్గించారు. ఈ నేపథ్యంలో నాజర్ కి సంబంధించి ఓ వార్త తమిళ్ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతుంది. త్వరలో ఆయన సినిమాలకు గుడ్ బై చెప్పబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
దక్షిణాదిలో విలక్షణ నటుడిగా గుర్తింపు తెచ్చుకున్న నాజర్.. యాక్టింగ్ కి రిటైర్మెంట్ ప్రకటించాలని స్వయంగా ఆయనే నిర్ణయించుకున్నరంటూ జోరుగా ప్రచారం జరుగుతుంది. ఆరోగ్య సమస్యల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు కూడా తెలుస్తోంది. లాక్ డౌన్ సమయంలో నాజర్ గుండె సంబంధిత సమస్యలతో బాధపడ్డ సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఆయన సెలక్టెడ్ చిత్రాలనే చేస్తున్నారు. ఆయన నటనకు శాశ్వతంగా సెలవు ఇచ్చి.. ఆరోగ్యంపై పూర్తిగా దృష్టి పెట్టాలనకుంటున్నారని సినీ వర్గాల సమాచారం. అయితే దీనిపై నాజర్ కానీ, ఆయన కుటుంబ సభ్యులు కానీ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఈ మధ్య ఓ సినిమా సెట్స్‌లో చిరంజీవిని కలిసిన నాజర్ ఇలా అన్నారట. సినిమా పరిశ్రమలో తన నటనకు సంబంధించి ఇదే చివరి దశ అని స్పష్టం చేశారు.
“నాకు తెలిసినంత వరకు నేను చివరి దశలో ఉన్నాను. సినిమాపై ఆసక్తి ఉంది. కానీ వయసు కూడా సహకరించాలి కదా. భవిష్యత్‌లో ఒకవేళ నటించినా చాలా సెలెక్టివ్ గా మాత్రమే చేస్తాను” అని నాజర్ రెండేండ్ల కిత్రమే ఓ ప్రముఖ మ్యాగజైన్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఎన్నో సినిమాల్లో వైవిధ్యమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకుల గుండెల్లో విలక్షణ నటుడిగా గుర్తింపు పొందిన ఆయన ఇక సినిమాల్లో కనిపించరంటే ప్రతి ఒక్కరు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇదే నిజమైతే సినీ పరిశ్రమ మరో గోప్ప నటుడిని మిస్ అవుతుందంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మరి.. ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.