Anirudh: దేశ వ్యాప్తంగా ప్రస్తుతం ఉన్న టాలెంటెడ్ సంగీత దర్శకుల్లో ‘అనిరుథ్ రవిచందర్’ ఒకరు. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా సినిమాకు తన సంగీతంతో ప్రాణం పోస్తున్నారు. ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌తో ప్రేక్షకుల ఒంటిపై గూస్ బంప్స్ తెప్పిస్తున్నారు. ఇందుకు తాజాగా విడుదలైన బీస్ట్, విక్రమ్ చిత్రాలు ప్రత్యక్ష ఉదాహరణ. ముఖ్యంగా విక్రమ్ సినిమా అంత సక్సెస్ సాధించటంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ముఖ్య భూమిక పోషించింది. అనిరుథ్ ప్రేక్షకుల మనసులో మ్యూజిక్ మ్యాజిక్‌ను నిలిచిపోయేలా చేశారు. తాజాగా, విక్రమ్ సినిమా సక్రెస్ ప్రెస్ మీట్లో పాల్గొన్న అనిరుథ్‌కు ఓ వింత ప్రశ్న ఎదురైంది. ఆ వింత ప్రశ్నకు మనసు గెలుచుకునే సమాధానం ఇచ్చారాయన.
ఓ మీడియా ప్రతినిధి ఆయన్ని ‘‘ కమల్ సార్! లోకేష్ కనకరాజ్‌కు లెక్సెస్ కారు గిఫ్ట్‌గా ఇచ్చారు. సూర్యకు రోలెక్స్ వాచ్ గిఫ్ట్‌గా ఇచ్చారు. మరి, మీకేం గిఫ్ట్‌గా ఇచ్చారు’’ అని అడిగాడు. ఇందుకు సమాధానంగా ‘‘ విక్రమ్ సినిమాను గిఫ్ట్‌గా ఇచ్చారు’ అని ఠక్కున సమాధానం ఇచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అనిరుథ్ చెప్పిన సమాధానం నెటిజన్ల మనసును గెలుచుకుంది. మరి, అనిరుథ్ సమాధానంపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.
Anirudh @anirudhofficial❤️😍😂#Vikram
@ikamalhaasan pic.twitter.com/fZf0Bx0bKL
— 𝚃𝚘𝚖 𝙷𝚊𝚛𝚍𝚢 (@flowerlikinga) June 14, 2022
ఇవి కూడా చదవండి : Kamal Haasan: అభిమానిపై సీరియస్ అయిన కమల్ హాసన్..! ఇంత కోపమా?\