లైగర్.. ప్రస్తుతం ఇండస్ట్రీని షేక్ చేస్తున్న పేరు. డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వలో విజయ్ దేవరకొండ హీరోగా అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన ట్రైలర్ కు ప్రేక్షకులు నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన మరో వీడియో నెట్టింట వైరల్ గా మారింది. మరి ఆ వివరాల్లోకి వెళితే..
తాజాగా లైగర్ మూవీకి సంబంధించిన తెలుగు ట్రైలర్ ను హైదరాబార్ లోని ప్రముఖ సుదర్శన్ థియోటర్ లో ప్రేక్షకుల మధ్య విడుదల చేశారు. ఈ క్రమంలో సాయంత్రం హింది ట్రైలర్ ను ముంబాయిలో విడుదల చేయగా.. ఆ వేడుకకు బాలీవుడ్ హీరో రణ్ వీర్ సింగ్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. వేడుకలో భాగంగా హీరో విజయ్, అనన్య, రణ్ వీర్ సింగ్ లు కలిసి ‘అకిడి.. పకిడి’ సాంగ్ కు డ్యాన్స్ చేశారు. దీనిలో భాగంగానే హీరోయిన్ ముద్దు అడగగా విజయ్ అనన్యకు ముద్దు పెట్టాడు. రణ్ వీర్ ని ముద్దు అడగ్గా అతను మాత్రం పక్కకి జరిగాడు. ఇక నిర్మత కరణ్ జోహార్ కాసేపు రణ్ వీర్ కు మేకప్ మాన్ గా చేస్తూ సందడి చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరి ఈ వీడియో పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
ఇదీ చదవండి: RGV కొత్త సినిమా కోవిడ్ ఫైల్స్! ప్రభుత్వాల అసమర్థతను తవ్వి తీస్తాడట!
ఇదీ చదవండి: Sudigali Sudheerజబర్దస్త్‌లోకి సుధీర్ రీ ఎంట్రీ అంటూ వార్తలు! అసలు నిజం?