ఈ మధ్యకాలంలో విడుదలకు సిద్ధమవుతున్న సినిమాలకు సంబంధించిన ప్రమోషన్స్ వెరైటీగా ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. రిలీజ్ కాబోతున్న సినిమా టీమ్ తో వేరే హీరోని లేదా సెలబ్రిటీని పిలిచి వారితో ఇంటర్వ్యూ నిర్వహిస్తున్నారు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అయితే సరే.. స్టార్ హీరోలను గెస్టులుగా పిలిచి సినిమాలను జనాల్లోకి మరింతగా తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఇక ఈ వారం రిలీజ్ కాబోతున్న సినిమాలలో ‘విరాటపర్వం‘ సినిమా ఒకటి.
స్టార్ హీరోయిన్ సాయిపల్లవి, దగ్గుబాటి రానా ప్రధాన పాత్రలలో నటించిన ఈ సినిమాను వేణు ఊడుగుల తెరకెక్కించారు. సుధాకర్ చెరుకూరి, సురేష్ బాబు సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా.. జూన్ 17న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. 1990ల్లో నక్సలిజం నేపథ్యంతో రూపొందించిన ఈ ప్యూర్ లవ్ అండ్ డ్రామా.. ఇప్పటికే సాంగ్స్, ట్రైలర్ తో ప్రేక్షకులలో అంచనాలు పెంచేసింది. ముఖ్యంగా సాయిపల్లవి, రానా సినిమాలోని క్యారెక్టర్స్ లో జీవించినట్లుగా అర్థమవుతుంది.
ఇక ఇటీవల విరాటపర్వం విప్లవ సాంగ్ వీడియోను రిలీజ్ చేసిన చిత్రబృందం.. వీలైనంత త్వరగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే.. తాజా సమాచారం మేరకు విరాటపర్వం ఈవెంట్ కి స్పెషల్ గెస్టులుగా ఇద్దరు స్టార్ హీరోలు రాబోతున్నారట. ఆ స్టార్ హీరోలు మరెవరో కాదు.. విక్టరీ వెంకటేష్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ రానున్నట్లు సినీవర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో ఈ ఈవెంట్ కి వెంకటేష్ వచ్చే అవకాశం ఉందిగానీ.. రామ్ చరణ్ రావడం కష్టమేనట. ఎందుకంటే.. రామ్ చరణ్ ప్రస్తుతం తన భార్యఉపాసనతో కలిసి వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేషన్స్ నిమిత్తం విదేశాలకు వెళ్ళాడు. చూడాలి మరి ఎవరెవరు హాజరవుతారో. ఇక విరాటపర్వం సినిమా గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Buzz : MegaPowerStar #Ramcharan to attend virata parvam pre release event.#VirataParvam
— __R@vi__ || 🎧 (@alwayzzRavi) June 13, 2022