ప్రేమ గీతాల కంటే విరహ గీతాల్లోనే ఓ భావోద్వేగం ఉంటుంది. కృష్ణకుమార్ కున్నాత్ అలియాస్ కేకే.. అలాంటి విషాద విరహ గీతాలతోనే ఎక్కువగా సినీ సంగీత ప్రియుల్ని ఆకట్టుకున్నారు. హుషారెత్తించే గీతాల కంటే ప్రేమ, విరహ గీతాలతోనే ఆయన ప్రేక్షకులకు చేరువయ్యారు. స్క్రీన్ మీద ఆయన పేరు చూడ్డమే కానీ.. రియల్ గా ఆయనను చూడ్డం చాలా తక్కువ. బాలీవుడ్‌తో పాటు తమిళ్, తెలుగు, కన్నడ, మరాఠీ, బెంగాళీ, అస్సామీ, గుజరాతీ, మలయాళంలోనూ 800 దాకా పాటలు పాడారు ఆయన. అంత గొప్ప గాయకుడైన కేకే మంగళవారం రాత్రి హఠాత్తుగా మృతి చెందారు. ప్రస్తుతం పోలీసులు ఆయన మృతికి గల కారణాలు తెలుసుకునే పనిలో ఉన్నారు. దర్యాప్తు ఇంకా కొనసాగతుంది.
మంగళవారం రాత్రి కోల్‌కతాలో ప్రదర్శన తర్వాత ఆయన గుండెపోటుతో కన్నుమూశారనే ప్రకటన మాత్రమే ఇప్పటిదాకా అందరికీ తెలుసు. అయితే.. కేకే చివరిసారిగా ప్రదర్శన ఇచ్చే సమయంలో తీవ్రంగా ఇబ్బంది పడ్డారు. కోల్‌కతా నజ్రుల్ మంచాలోని గురుదాస్ కాలేజ్ వద్ద జరిగిన కాన్సెర్ట్‌లో పాల్గొన్నారు కేకే. అయితే ఆ సమయంలో ఆయన చాలా ఇబ్బందికి లోనయ్యారు. వేదిక క్లోజ్డ్ హాల్. ఫ్యాన్, ఏసీ సదుపాయాలు లేకపోవడంతో విపరీతమైన చెమటలు పోసి ఇబ్బందిపడ్డారు. ఒకానొక టైంలో భరించలేక కిందకు దిగి నిర్వాహకులకు స్వయంగా ఆయనే తనకు కలుగుతున్న అసౌకర్యంపై ఫిర్యాదు కూడా చేశారు.
ఇది కూడా చదవండి: Allu Arjun: భార్యతో అల్లు అర్జున్ డేట్ నైట్.. ఫొటోలు వైరల్!అయినా నిర్వాహకులు సరిగా స్పందించలేదు. దీంతో ఇబ్బంది పడుతూనే ఆయన గంటపాటు ప్రదర్శన ఇచ్చారు. ఆ తర్వాత హోటల్ ఒబెరాయ్ గ్రాండ్‌కు చేరుకుని ఛాతీలో భారంగా ఉందని తన సిబ్బందికి తెలిపారాయన. అలా చెబుతూనే కుప్పకూలిన ఆయన్ని.. ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. గుండె పోటుతోనే మృతి చెంది ఉంటారని వైద్యులు చెబుతున్నారు. అయితే పోలీసులు మాత్రం అసహజ మరణం కిందే కేసు నమోదు చేసుకోవడం విశేషం. ప్రస్తుతం ఆయన మృతదేహాన్ని సీఎంఆర్ఐ ఆస్పత్రిలో ఉంచారు. పోస్ట్ మార్టం పూర్తి అయితేనే ఆయన మృతికి గల అసలు కారణం తెలిసేది.
ఇది కూడా చదవండి: Jayaprada: తెలుగు రాష్ట్రాల ఎన్నికలలో పోటీ చేయాలని ఉంది: నటి జయప్రద
ఇదిలా ఉంటే కేకే చివరి వీడియో ఒకటి నెట్టింట వైరలవుతోంది. దీనిలో ఆయన చెమటలు పట్టిన ముఖాన్ని తుడుచుకుంటున్నారు. ఈ వీడియో చూసిన కేకే అభిమానులు ఆయన మరణానికి నిర్వహకుల నిర్లక్షమే కారణమంటూ విమర్శిస్తున్నారు. ‘అక్కడ ఏసీ లేదు. వేడి, డీహైడ్రేషన్ వల్లే స్ట్రోక్స్, కార్డియాక్ అరెస్ట్‌లు సంభవిస్తాయి’ అని ఒక అభిమాని ట్వీట్ చేశాడు. ‘ఆ కాన్సెర్ట్‌లో పాల్గొనకపోతే కేకే బతికి ఉండేవాడు. కేవలం ఆయన తన అభిమానుల కోసమే ప్రదర్శన ఇచ్చారు. నిర్వాహణ లోపం కారణంగా మనం ఒక రత్నాన్ని కోల్పోయాం’ అని మరో అభిమాని ఆవేదన వ్యక్తం చేశాడు. మరి దీనిపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
AC wasn’t working at Nazrul Mancha. he performed their and complained abt it bcoz he was sweating so badly..it wasnt an open auditorium. watch it closely u can see the way he was sweating, closed auditorium, over crowded,
Legend had to go due to authority’s negligence.
Not KK pic.twitter.com/EgwLD7f2hW— WE जय (@Omnipresent090) May 31, 2022