1) రాధే శ్యామ్:
ప్రభాస్, పూజాహెగ్డే జంటగా రాధాకృష్ణకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతోంది.2) RRR:
స్టార్ హీరోలు ఎన్టీఆర్, రాంచరణ్ ప్రధాన పాత్రలలో డైరెక్టర్ రాజమౌళి తెరకెక్కించిన పీరియాడిక్ మల్టీస్టారర్ ఇది. 2022 మార్చి 25న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.
3) కేజీఎఫ్ 2:
కన్నడ స్టార్ హీరో యష్ హీరోగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందించిన డార్క్ మాఫియా మూవీ ఇది. 2022 ఏప్రిల్ 14న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతోంది.4) లాల్ సింగ్ చద్దా:
అమీర్ ఖాన్, కరీనా కపూర్, నాగచైతన్య ప్రధానపాత్రలలో హాలీవుడ్ ‘ఫారెస్ట్ గంప్’ చిత్రానికి రీమేక్ గా ఇది తెరకెక్కింది. అద్వైత్ చందన్ దర్శకత్వం వహించిన ఈ కామెడీ డ్రామా చిత్రం 2022 ఆగష్టు 11న రిలీజ్ కాబోతుంది.5) మేజర్:
అడవి శేష్ ప్రధాన పాత్రలో మేజర్ ఉన్నికృష్ణన్ జీవితకథ ఆధారంగా తెరకెక్కిన ఈ సినిమాను శశికిరణ్ టిక్కా రూపొందించారు. మూడు భాషలలో 2022 మే 27న పాన్ ఇండియా రిలీజ్ అవుతోంది.6) లైగర్:
విజయ్ దేవరకొండ, అనన్యపాండే జంటగా పూరీ జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ స్పోర్ట్స్ డ్రామా చిత్రం.. 2022 ఆగష్టు 25న వరల్డ్ వైడ్ రిలీజ్ కాబోతుంది.7) బ్రహ్మాస్త్ర:
బాలీవుడ్ స్టార్స్ రణబీర్ కపూర్, అలియాభట్, అక్కినేని నాగార్జున ప్రధాన పాత్రలలో డైరెక్టర్ అయాన్ ముఖర్జీ తెరకెక్కిస్తున్న మైథలాజికల్ సోషియో ఫాంటసీ మూవీ ఇది. 2022 సెప్టెంబర్ 9న రిలీజ్ కాబోతుంది.8) సలార్:
ప్రభాస్, శృతిహాసన్ జంటగా డైరెక్టర్ ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న సాలిడ్ మాఫియా యాక్షన్ మూవీ ఇది. ఈ సినిమా 2023లో కానున్నట్లు తెలుస్తుంది.9) హరిహర వీరమల్లు:
పవన్ కళ్యాణ్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న ఫస్ట్ పీరియాడిక్ డ్రామా మూవీ ఇది. డైరెక్టర్ క్రిష్ జాగర్లమూడి తెరకెక్కిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా స్థాయిలో 2022 దసరాకి రిలీజ్ చేస్తారని టాక్.
10) పొన్నియన్ సెల్వన్-1:
లెజెండరీ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వంలో స్టార్ హీరోలు విక్రమ్, కార్తీ, జయం రవి, ఐశ్వర్యరాయ్, అతిథిరావు హైదరి తదితర ప్రముఖులు నటిస్తున్న చిత్రమిది. ఓ చారిత్రాత్మక గ్రంథం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ చిత్రం 2022 సెప్టెంబర్ 30న రిలీజ్ కాబోతుంది.
11) ఆదిపురుష్: ప్రభాస్, కృతిసనన్ ప్రధాన తారలుగా రామాయణం నేపథ్యంలో తెరకెక్కుతున్న 3డి చిత్రమిది. ఓం రౌత్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా 2022 జనవరి 12న రిలీజ్ కాబోతుంది.12) ఇండియన్-2:
విశ్వనటుడు కమల్ హాసన్, దర్శకుడు శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ పొలిటికల్ యాక్షన్ డ్రామా.. రిలీజ్ డేట్ ఇంకా ఖరారు కాలేదు.13) ప్రాజెక్ట్-K:
ప్రభాస్, దీపికా పదుకోనె జంటగా డైరెక్టర్ నాగ్ అశ్విన్ రూపొందిస్తున్న సైన్స్ ఫిక్షన్ మూవీ.. 2024లో రిలీజ్ కానున్నట్లు సమాచారం.14) RC15:
రాంచరణ్ – కియారా అద్వానీ జంటగా డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్ యాక్షన్ డ్రామా ఇది.. ప్రస్తుంటాం షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా నుండి టైటిల్, రిలీజ్ డేట్ రావాల్సి ఉంది.15) రాజమౌళి – మహేష్ బాబు మూవీ: అధికారికంగా ప్రకటించిన మహేష్ బాబు, రాజమౌళి కాంబినేషన్ మూవీ.. నుండి ఇంకా ఎలాంటి సమాచారం బయటికి రాలేదు. కానీ ఇది పాన్ ఇండియా మూవీగా తెరకెక్కనుంది.
16: స్పిరిట్: ప్రభాస్ హీరోగా డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది. త్వరలోనే పట్టాలెక్కనున్న ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో రూపొందనుంది.
17: పుష్ప-2:
అల్లు అర్జున్, రష్మిక మందన జంటగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన పుష్పకి సీక్వెల్ ఇది. ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉన్న ఈ సినిమాను 2022 లోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.18: యుగానికి ఒక్కడు-2:
2010లో కార్తీ హీరోగా సెల్వ రాఘవన్ తెరకెక్కించిన యాక్షన్ – అడ్వెంచర్ మూవీ యుగానికి ఒక్కడు. దీనికి సీక్వెల్ గా సెల్వ రాఘవన్.. ధనుష్ హీరోగా రూపొందించనున్నాడు. అధికారిక ప్రకటన వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం స్క్రిప్ట్ దశలో ఉంది19: మహావీర్ కర్ణ:
విక్రమ్ ప్రధాన పాత్రలో మహాభారతం నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ మైథలాజికల్ మూవీని డైరెక్టర్ ఆర్.ఎస్. విమల్ తెరకెక్కించనున్నారు. ప్రస్తుతం ఈ సినిమా స్క్రిప్ట్ దశలో ఉంది.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.