మెగాస్టార్ చిరంజీవి, తనయుడు రామ్ చరణ్ కలిసి నటించిన మూవీ ఆచార్య. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ, మ్యాట్నీ ఎంటర్‌టైన్‌మెంట్ సంయుక్తంగా నిర్మించారు. ఇక భారీ అంచనాల నడుమ ఈ మూవీ శుక్రవారం ప్రేక్షకుల మందుకు వచ్చింది. అయితే చిరంజీవి దాదాపు నాలుగేళ్ల తర్వాత స్క్రీన్ మీద కనిపించడంతో అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే
ఇది కూడా చదవండి: రాయల్ బెంగాల్ టైగర్ కి ‘ప్రభాస్’ పేరు.. ఎక్కడంటే?
ఈ మూవీని టాలీవుడ్ లోని ప్రముఖ నిర్మాతలు, దర్శకులు ప్రత్యేకంగా వీక్షించారు. ఇక తాజాగా మెగా కోడలు రామ్ చరణ్ భార్య ఉపాసన సైతం ఏఎంబీ మాల్‌లో అభిమానుల మధ్యలో వీక్షిస్తూ ఓ పోస్ట్ పెట్టారు. లవ్ లవ్ లవ్ ది మూవీ అంటూ నమ్రత శిరోద్కర్ కు ట్యాగ్ కూడా చేశారు ఉపాసన. అనంతరం సక్సెస్ సెలెబ్రేషన్స్‌లకు సంబంధించిన వీడియోను కూడా ఉపాసన షేర్ చేశారు. ఆచార్య మూవీపై ఉపాసన చేసిన కామెంట్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి.
మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం SumanTV App డౌన్లోడ్ చేసుకోండి.