ఇటీవల వెండితెర, బుల్లితెర ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే. ప్రముఖ నటీనటులు, దర్శక-నిర్మాతలు, ఇతర సాంకేతిక రంగానికి చెందిన వారు.. బుల్లితెర నటులు, యాంకర్లు, న్యూస్ ప్రెజంటర్స్ కన్నుమూయడంతో వారి కుటుంబాల్లోనేకాదు.. అభిమానులు సైతం శోక సంద్రంలో మునిగిపోతున్నారు. గత నెల బుల్లితెర నటీనటులు ఒక్కరోజు గ్యాప్ తోనే కన్నుమూయడంతో ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. తాజాగా బుల్లితెర తొలితరం యాంకర్, ఇంగ్లీష్ న్యూస్ ప్రెజంటర్ గీతాంజలి కన్నుమూశారు. వివరాల్లోకి వెళితే..
జాతీయ ప్రసార సంస్థ దూరదర్శన్‌లో ప్రముఖ యాంకర్, ఇంగ్లష్ న్యూస్ ప్రజెంటర్ గా పాపులర్ అయిన గీతాంజలి అయ్యర్ బుధవారం కన్నుమూశారు. ఆమె తన జీవితంలో 30 సంవత్సరాల న్యూస్‌రూమ్‌కు అంకితం చేశారు. దశాబ్దాల సుదీర్ఘ కెరీర్‌లో ఉత్తమ టీవీ న్యూస్ ప్రెజెంటర్‌గా పనిచేసి ఎన్నో అవార్డులు, రివార్డులతో పాటు ప్రశంసలు అందుకున్నారు. గీతాంజలి అయ్యర్ 1971లో దూరదర్శన్‌లో చేరారు. 1978లో ఆల్ ఇండియా రేడియో దూరదర్శన్ నుండి విడిపోయినప్పుడు ఆమె దూరదర్శన్‌లోనే ఉండాలని నిర్ణయించుకుంది.
గీతాంజలి 1989లో అత్యుత్తమ మహిళలకు ఇందిరా గాంధీ ప్రియదర్శిని అవార్డును గెలుచుకుంది. భారతదేశంలోని వరల్డ్ వైడ్ ఫండ్‌లో మేజర్ డోనర్స్ హెడ్‌గా పనిచేశారు. గీతాంజలి అయ్యర్ ఇంగ్లీష్‌లో అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ పూర్తి చేసిన తర్వాత కోల్‌కతాలోని లోరెటో కాలేజీ నుండి పట్టభద్రురాలైంది. ఆ తర్వాత నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా నుండి డిప్లొమా కూడా చేసింది. ఆమె మృతిపై ప్రముఖులు సోషల్ మీడియా వేధికగా నివాళులర్పిస్తున్నారు.
Gitanjali Aiyar, India’s one of the best tv newsreaders, warm and elegant person and woman of immense substance passed away today. Deepest condolences to her family. 🙏 pic.twitter.com/4q1C6vFHbh
— Sheela Bhatt शीला भट्ट (@sheela2010) June 7, 2023