ఈ మధ్యకాలంలో పెళ్లీడుకు వచ్చిన సెలబ్రిటీలంతా బ్యాచిలర్ లైఫ్ కి ఫుల్ స్టాప్ పెట్టేసి.. ఒక్కొక్కరుగా పెళ్లి పీటలెక్కుతున్నారు. ఇటీవల స్టార్ హీరోయిన్ హన్సికతో పాటు హరిప్రియ కూడా తాము ప్రేమించినవారితో మూడు ముళ్ళు వేయించుకుని వివాహ బంధంలో అడుగు పెట్టారు. ఇప్పుడు సెలబ్రిటీ పెళ్లి చేసుకునేందుకు రెడీ అయిపోయింది. ప్రముఖ సీరియల్ నటి రితికా తమిళసెల్వి.. తాను ప్రేమించిన అబ్బాయినే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించి అందరినీ సర్ప్రైజ్ చేసింది. బుల్లితెరపై రాజారాణి, భాగ్యలక్ష్మి లాంటి సీరియల్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకుంది రితికా.
ఇన్నాళ్లు సీరియల్ నటిగా సింగిల్ లైఫ్ ఎంజాయ్ చేసిన ఈ బ్యూటీ.. కొద్దిరోజుల క్రితమే మనసుకు నచ్చిన వ్యక్తితో ఉంగరాలు కూడా మార్చేసుకుంది. ప్రస్తుతం వీరి పెళ్లికి సంబంధించి పిక్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతున్నాయి. కాగా.. సీరియల్ నటి రితికా చేసుకోబోయే వరుడు ఎవరు? అని ఆరా తీయడం మొదలుపెట్టారు ఫ్యాన్స్. మొదటగా టీవీ యాంకర్ దివ్యదర్శిని షేర్ చేసిన పిక్ ద్వారా రితికా పెళ్లి వార్త బయటికి వచ్చింది. అయితే.. రితికా పెళ్లాడబోయే వ్యక్తి ఎవరో కాదని.. అతను కూడా టీవీ ఇండస్ట్రీలోనే వర్క్ చేస్తున్నాడని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
మరి ఆ వ్యక్తి ఎవరనే వివరాలు ఆరా తీయగా.. అతని పేరు ‘విను నారాయణ్’ అని, అతను తమిళ టీవీ రంగంలో క్రియేటివ్ డైరెక్టర్ గా వర్క్ చేస్తున్నాడని సమాచారం. అంతేగాక రితికా – విను నారాయణ్ ఇద్దరూ కూడా సీరియల్స్, టీవీ షోస్ కి కలిసి పనిచేసే టైంలో ఒకరినొకరు ఇష్టపడి ప్రేమించుకున్నారట. ప్రస్తుతం వీరి పెళ్లి విషయం ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. కాగా.. పలు సీరియల్స్ తో సూపర్ క్రేజ్ సొంతం చేసుకున్న రితికా.. కామెడీ రియాల్టీ షో ‘కామెడీ రాజా కలక్కల్ రాణి’లో మొదటి రన్నరప్ గా నిలిచింది. ఇక పెళ్లి పిక్స్ బయటికి వచ్చేసరికి ఫ్యాన్స్, నెటిజన్స్ సోషల్ మీడియాలో విష్ చేస్తున్నారు. కెరీర్ పరంగా రితికా.. చాకోలెట్, తిరుమగళ్, శివ మనసుల శక్తి లాంటి సీరియల్స్ తో పాటు కూకు విత్ కోమాలి, స్టార్ మ్యూజిక్, సింగిల్ పన్నుంగా, రాజు వీట్ల పార్టీ లాంటి ప్రోగ్రామ్స్ చేసింది.