సౌత్ ఇండియన్ స్టార్ హీరోలలో ఒకరు అజిత్ కుమార్. పేరుకు తమిళ నటుడు అయినప్పటికీ, తెలుగులో కూడా అజిత్ కి ఫ్యాన్ బేస్ భారీగానే ఉంది. ప్రస్తుతం అజిత్.. వాలిమై అనే పవర్ ప్యాకడ్ యాక్షన్ మూవీలో నటిస్తున్నాడు. టాలెంటెడ్ డైరెక్టర్ హెచ్.వినోద్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా పై అభిమానుల్లో అంచనాలు తారాస్థాయిలో నెలకొన్నాయి.
దాదాపు ఏడాది కాలంగా వాలిమై చిత్రంకోసం ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. కానీ మేకర్స్ అప్పుడప్పుడు కొత్త పోస్టర్స్ రిలీజ్ చేస్తూ ట్రీట్ ఇస్తున్నారు. స్టార్ ప్రొడ్యూసర్ బోనీకపూర్ నిర్మిస్తున్న ఈ సినిమా.. 2022 సంక్రాంతి కానుకగా జనవరి 13న వివిధ భాషల్లో రిలీజ్ కాబోతుంది. ఈ సినిమాలో తెలుగు హీరో కార్తీక్ గుమ్మకొండ, హ్యూమా ఖురేషి తదితరులు కీలకపాత్రలు పోషిస్తున్నారు.
అయితే తాజాగా వాలిమై మేకర్స్.. మేకింగ్ వీడియో ఒకటి రిలీజ్ చేసారు. ఆ వీడియోలో అజిత్ రిస్కీ స్టంట్స్.. ఒళ్ళు గగ్గుర్పొడిచే యాక్షన్ సీన్స్.. కార్తీక్ సిక్స్ ప్యాక్ పర్సనాలిటీ.. ఇలా అన్నిటిని చూపించారు. ప్రస్తుతం ఈ వీడియో ట్రెండింగ్ లో ఉంది. మీరు ఈ వీడియో పై లుక్కేసి మీ అభిప్రాయాలను కామెంట్స్ చేయండి.