ఈ మధ్యకాలంలో ప్రేక్షకులు సినిమాలను చూసే విధానాన్ని పూర్తిగా మార్చేశారు. ఫేవరేట్ హీరోల సినిమాలు చూసేందుకు థియేటర్లకి కేవలం యూత్ మాత్రమే వెళ్తున్నారు. విడుదలైన సినిమాలలో కంటెంట్ కొత్తగా ఉందా లేదా అనేది చూస్తున్నారు ప్రేక్షకులు. ఓటిటిలు అందుబాటులో వచ్చాక కంటెంట్ ప్రకారం సినిమాలు చూస్తున్నారు. అందుకే దర్శకనిర్మాతలు కూడా రొటీన్ సినిమాలు కాకుండా కొత్తగా చేసేందుకు ట్రై చేస్తున్నారు. ఇక ప్రతి వారంలాగే ఈ వారం కూడా థియేటర్లలో చాలా సినిమాలు రిలీజ్ రిలీజ్ కి రెడీ అయిపోయాయి. నవంబర్ నెలలో 4వ శుక్రవారం వారం.. ఆంటే 25వ తేదీన దాదాపు 14 సినిమాలు థియేట్రికల్ రిలీజ్ అవుతున్నాయి.