సినీ ఇండస్ట్రీలో మ్యూజిక్ సెన్సేషన్ తమన్ పేరు ఓ మంత్రంలా మారిపోయింది. ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కుతున్న బిగ్గెస్ట్ సినిమాలన్నింటికీ తమన్ సంగీతం అందిస్తుండటం విశేషం. అయితే.. తమన్ లైనప్ లో మెగాప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కిన గని సినిమా ఉన్న సంగతి తెలిసిందే. తొలిప్రేమ లాంటి మ్యూజికల్ హిట్ తర్వాత తమన్ – వరుణ్ కాంబోలో వస్తున్న మూవీ ఇది.
#Ghani “Romeo Juliet” Song On 8th Feb
Music By Thaman
Sung By – Aditi Shankar pic.twitter.com/UNYXd73z0i— Trendswood (@Trendswoodcom) February 6, 2022
తాజాగా గని సినిమా నుండి ‘రోమియో జూలియెట్‘ సాంగ్ లాంచ్ చేశారు మేకర్స్. అయితే.. ఈ సాంగ్ లాంచ్ ప్రోగ్రాంలో తమన్ తన బృందంతో పాటు పెర్ఫర్మ్ చేశాడు. ఈ సందర్భంగా సాంగ్ గురించి తమన్ మాట్లాడుతూ.. ‘ఈ సాంగ్ నేను ఓ అమ్మాయికి ప్రపోజ్ చేసేందుకు 7 ఏళ్ల క్రితం రెడీ చేశాను. కానీ ప్రపోజ్ చేయలేకపోయాను’ అంటూ సరదాగా చెప్పుకొచ్చాడు. మరి ఎప్పుడో పెళ్లి చేసుకున్న తమన్.. మరో అమ్మాయి కోసం ట్యూన్ రెడీ చేయడం ఏంటని.. ఫ్యాన్స్ ఆశ్చర్యపోతున్నారు. ప్రస్తుతం నెట్టింట తమన్ మాటలు వైరల్ అవుతున్నాయి. ఈ వీడియో పూర్తిగా చూసి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.