చెన్నైలో ప్రస్తుతం స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఎన్నికలలో ఓటు హక్కును వినియోగించుకోవడానికి తలపతి విజయ్ వెళ్లారు. ఆయన వస్తున్న విషయం తెలుసుకొని అభిమానులు, మీడియా వ్యక్తులు చాలామంది చేరడంతో అక్కడ విపరీతమైన గందరగోళ పరిస్థితి నెలకొంది. ఇక అభిమానులను పోలీసులు సెక్యూరిటీ కూడా కంట్రోల్ చేయకపోయింది.
ఇది చదవండి : Bigg Boss Utsavam: కంటెస్టెంట్ లకు సోహెల్ బిర్యానీ దావత్!
అభిమానుల తాకిడికి మిగతా సాదారణ ప్రజలతో పాటు మీడియా సభ్యులు కూడా ఇబ్బంది పడ్డారు. హీరో విజయ్ తనవల్ల జరిగిన అసౌకర్యానికి క్షమాపణలు చెప్పారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. విజయ్ సింప్లిసిటీకి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.
కాగా, ఈ ఎన్నికలలో విజయ్ అభిమానులు కూడా పోటీ చేస్తున్నారు. విజయ్ అభిమానుల సంఘం “తలపతి విజయ్ మక్కల్ ఇయక్కం” (TVMI) జెండా, పేరును ఎన్నికల్లో ఉపయోగించుకోవడానికి విజయ్ కూడా ఒప్పుకున్నాడు. ఇదిలా ఉండగా, త్వరలోనే విజయ్ కూడా పాలిటిక్స్ లోకి వస్తాడని తమిళ మీడియాలో వార్తలు వస్తున్నాయి.
His Simplicity 😊🖤 #Vijay#TnLocalBodyElection @actorvijayhttps://t.co/sLr7WM2a00 pic.twitter.com/fAAW0voj0S
— مادهيسفج (@MADHESVJ1) February 19, 2022