Taraka Ratna Passed Away LIVE News Updates in Telugu: నందమూరి తారకరత్న కన్నుమూశారు. బెంగుళూరులోని నారాయణా హృదయాలయా ఆస్పత్రిలో గత 23 రోజులుగా ఆస్పత్రిలో చికిత్స పొందుతన్న ఆయన తాజాగా తుదిశ్వాస విడిచారు.
సినీ నటుడు నందమూరి తారకరత్న(39) కన్నుమూశారు. గత 23 రోజులగా బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న తారకరత్న శనివారం రాత్రి తుదిశ్వాస విడిచారు. తారకరత్న మృతితో నందమూరి కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నారు.
నందమూరి తారకరత్న అంత్యక్రియలు ముగిశాయి. సోమవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని మహా ప్రస్థానంలో అంత్యక్రియలు జరిగాయి. కుటుంబసభ్యులతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు, టీడీపీ కార్యకర్తలు పాల్గొన్నారు. తారకరత్న తండ్రి మోహనకృష్ణ కుమారుడి చితికి నిప్పు పెట్టారు. అంతకు కొన్ని నిమిషాల ముందు మోహనకృష్ణ కుమారుడి ముఖాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించారు. అతి కష్టం మీద కుమారుడికి తన కొరివి పెట్టారు.
ప్రముఖ నటుడు నందమూరి తారకరత్న అంతిమయాత్ర మొదలైంది. తారకరత్న భౌతికదేహాన్ని అంతిమయాత్ర రథంలో ఎక్కించారు. చంద్రబాబు, బాలకృష్ణ కూడా ఆ రథంలోకి ఎక్కారు. అంతిమయాత్ర రథం మరికొద్దిసేపట్లో మహాప్రస్థానం చేరుకోనుంది. అక్కడ తారకరత్న అంతిమ సంస్కారాలు జరగనున్నాయి.
నందమూరి తారకరత్న కడసారి చూపుకోసం ప్రముఖ సీనియర్ నటి అన్నపూర్ణ ఫిల్మ్ ఛాంబర్‌కు వెళ్లారు. తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పించారు. తారకరత్న భౌతిక దేహాన్ని చూసి వెక్కి వెక్కి ఏడ్చారు. ఎక్కువ సేపు అక్కడ ఉండలేక అక్కడినుంచి వెళ్లిపోయారు.
నందమూరి తారకతర్న భౌతికదేహం ఈ ఉదయమే ఫిల్మ్ ఛాంబర్‌కు తీసుకువచ్చారు. నందమూరి కుటుంబసభ్యులు మొత్తం అక్కడే ఉన్నారు. సినీ, రాజకీయ ప్రముఖులతో పాటు పెద్ద ఎత్తున అభిమానులు ఫిల్మ్ ఛాంబర్‌కు వస్తున్నారు. తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ మధ్యాహ్నం మూడు గంటల వరకు తారకరత్న పార్థివదేహాన్ని అభిమానుల సందర్శనార్థం ఉంచనున్నారు.
టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు శంకరపల్లి, మోకిలలోని తారకరత్న నివాసానికి వెళ్లారు. భార్య భువనేశ్వరితో కలిసి తారకరత్న భౌతికదేహానికి నివాళులు అర్పించారు.
కల్యాణ్ రామ్, జూనియర్ ఎన్టీఆర్ మోకిలలోని తారకరత్న ఇంటికి చేరుకున్నారు. సోదరుడి భౌతికదేహానికి నివాళులు అర్పించారు. బాధాతప్త హృదయాలతో కంటతడి పెట్టుకున్నారు.
నందమూరి తారకరత్న మరణంపై కర్ణాటక ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై స్పందించారు. ఈ మేరకు ఆదివారం ట్విటర్ వేదికగా ఓ ట్వీట్ పెట్టారు. ఆ ట్వీట్‌లో.. ‘‘ తెలుగు సినిమా నటుడు, తెలుగు దేశం పార్టీ నాయకుడు నందమూరి తారకరత్న హఠాన్మరణం గురించి తెలిసి చాలా బాధకలిగింది. చాలా త్వరగా ఆయన జీవితం ముగిసిపోయింది. ఆయన ఆత్మకు శాంతి కలుగుగాక. ఈ పెనువిషాదాన్ని తట్టుకునే శక్తిని ఆయన కుటుంబానికి, బంధుమిత్రులకు ఇవ్వాలని దేవుడ్ని ప్రార్థిస్తున్నా’’ అని అన్నారు.
Saddened by the untimely demise of Telugu film actor & Telugu Desam Party Member Sri Nandamuri Taraka Ranta Garu. A life cut short too soon. May his soul rest in peace. May God grant his kith & kin the strength to bear this huge loss. #TarakRatna
— Basavaraj S Bommai (@BSBommai) February 19, 2023
తారకరత్న మరణంపై ప్రముఖ సంగీత దర్శకుడు ఎస్‌ఎస్ థమన్ ఆవేదన వ్యక్తం చేశారు. చాలా త్వరగా వెళ్లిపోయారంటూ ట్విటర్ వేదికగా ఓ ఎమోషనల్ పోస్టు పెట్టారు. ‘‘ చాలా త్వరగా వెళ్లిపోయారు అన్న. మీ ఆత్మకు శాంతి కలుగుగాక. మీ కుటుంబానికి ఆ దేవుడు ధైర్యాన్నిచ్చుగాక’’ అని పేర్కొన్నారు.
Gone too Soon Dear Anna 🥹
May Ur Soul Rest in Peace Anna 💔
Strength to the Family ..#TarakRatna 🥹 pic.twitter.com/nRjzImkJFW— thaman S (@MusicThaman) February 18, 2023
నందమూరి తారకరత్న మరణంపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఈ మేరకు పీఎమ్‌బో ఓ ట్వీట్ చేసింది. ఆ ట్వీట్లో.. ‘‘ నందమూరి తారకరత్న గారి హఠాన్మరణం చాలా బాధకలిగించింది. చలనచిత్ర రంగంలో ఆయన తన మార్కును చాటుకున్నారు. వారి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా. ఓం శాంతి’’ అని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
Pained by the untimely demise of Shri Nandamuri Taraka Ratna Garu. He made a mark for himself in the world of films and entertainment. My thoughts are with his family and admirers in this sad hour. Om Shanti: PM @narendramodi
— PMO India (@PMOIndia) February 19, 2023
‘‘తారకరత్న మరణ వార్త తెలిసి నా హృదయం ముక్కలైంది. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంసభ్యులు, స్నేహితులు, అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. తారకరత్న ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నా’’ అని హీరో అల్లు అర్జున్ అన్నారు. ఈ మేరకు ట్విటర్‌లో ఓ పోస్టు పెట్టారు.
Heartbroken to learn of the passing away of #TarakaRatna garu. Gone to soon 💔. My deepest condolences to his family, friends & fans. May he rest in peace.
— Allu Arjun (@alluarjun) February 18, 2023
తారకరత్న భౌతికకాయం హైదరాబాద్, మోకిలలోని ఇంటికి చేరుకుంది. కుటుంబసభ్యులు ఒక్కొక్కరిగా అక్కడికి చేరుకుంటున్నారు. తారకరత్న భౌతికకాయానికి నివాళులు అర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తండ్రి మృతదేహాన్ని చూసి ఆయన కూతురు విలవిల్లాడిపోయింది. తండ్రిని తట్టిలేపుతూ వెక్కివెక్కి ఏడ్చిండి. తారకరత్న కూతురు అలా ఏడుస్తుండటంతో అక్కడి వారి కళ్లలో కూడా నీళ్లు తిరిగాయి.
తారకరత్న భౌతికదేహం హైదరాబాద్ చేరుకుంది. బెంగళూరు నుంచి ఉదయం అంబులెన్స్‌లో హైదరాబాద్‌కు వచ్చింది. ఆయన పార్థివ దేహాన్ని నేరుగా మోకిలలోని స్వగృహానికి తీసుకువచ్చారు. రేపు ఫిల్మ్ ఛాంబర్‌లో ఉంచనున్నారు. రేపు ఉదయం 7 గంటల నుంచి అభిమానుల సందర్శనకు అవకాశం ఇవ్వనున్నారు.
ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి నందమూరి తారకరత్న మరణంపై స్పందించారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. ఆ పోస్టులో.. ‘‘ తారకరత్న మరణం చాలా బాధాకరం. చాలా త్వరగా వెళ్లిపోయారు. ఆయన కుటుంబసభ్యులు, ప్రియమైన వారికి నా ప్రగాఢ సానుభూతి. మీరు దూరం అయినా.. మిమ్మల్ని ఎప్పటికీ మర్చిపోలేము’’ అని పేర్కొన్నారు.
It is disheartening to hear about the loss of #NandamuriTarakaRatna garu. Gone too soon! My deepest condolences to his family members and their loved ones. You will be missed but never forgotten!#OmShanti pic.twitter.com/RJE566ATYk
— Anil Ravipudi (@AnilRavipudi) February 18, 2023
నందమూరి తారకరత్న హఠాన్మరణం బాధాకరమని ప్రముఖ టాలీవుడ్ హీరో నాగశౌర్య అన్నారు. తారకరత్న బంధు మిత్రులు, శ్రేయోభిలాషులకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు శనివారం తన ట్విటర్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. తారకరత్న మృతిపై ఆవేదన వ్యక్తం చేశారు.
Deeply Saddened by the untimely demise of our beloved #NandamuriTarakaRatna Garu.
My heartfelt condolences to all his near and dear ones.
Omshanthi🙏 pic.twitter.com/l2SvKPSq1Q— Naga Shaurya (@IamNagashaurya) February 18, 2023
నందమూరి తారకరత్న మరణంపై ఆయన బాబాయ్ ప్రముఖ నటుడు బాలకృష్ణ స్పందించారు. ఫేస్‌బుక్ వేదికగా ఓ పోస్టు పెట్టారు. బాల బాబాయ్ అంటూ ఆప్యాయంగా పిలిచే మా తారకరత్న పిలుపు ఇక వినబడదని ఊహించుకోవడాన్నే తట్టుకోలేకపోతున్నానని అన్నారు. నందమూరి అభిమానులకు, టీడీపీ కుటుంబ సభ్యులకు తారకరత్న మరణం తీరని లోటని పేర్కొన్నారు. తారకరత్న నటనలోనూ తనకు తాను నిరూపించుకున్నాడని తెలిపారు. కఠోరంగా మృత్యువుతో పోరాడుతున్నప్పుడు మృత్యుంజయుడై తిరిగి వస్తాడని భావించానన్నారు. తారకరత్న ఇక కానరాని లోకాలకు వెళ్ళాడంటూ ఆవేదన వ్యక్తం చేశాడు. తారతరత్న ఆత్మకు భగవంతుడు శాంతి కలిగించాలని కోరారు.
తారకరత్న మరణవార్తను జీర్ణించుకోలేకపోతున్ననని తెలంగాణ ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు తెలిపారు. "సినీనటుడు నందమూరి తారకరత్న మరణవార్త తెలిసి తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. ఈ దుఃఖ సమయంలో అతని కుటుంబ సభ్యులకు, స్నేహితులకు హృదయపూర్వకంగా సానుభూతి తెలియజేస్తున్నాను. అతని ఆత్మకు శాంతి కలుగాలని ప్రార్థిస్తున్నాను. ఓం శాంతి.." అంటూ హరీశ్ రావు ట్విట్టర్ ద్వారా తన సంతాపాన్ని తెలియజేశారు.
Deeply saddened to know the demise of actor Nandamuri Taraka Ratna.
Heartfelt condolences to his family and friends at this time of grief. May his Soul Rest in Peace.Om Shanti🙏🏾 pic.twitter.com/XRn28J6afq
— Harish Rao Thanneeru (@BRSHarish) February 18, 2023
అందరితో కలిసిమెలిసి ఉండే తారకరత్న మరణం అందరినీ కలిచివేస్తోంది. అతనితో ఉన్న జ్ణాపకాలను తలుచుకొని ప్రతి ఒక్కరు కంటతడి పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో తారకరత్న అకాల మరణం పట్ల హీరో అల్లరి నరేష్ తీవ్ర దిగ్భ్రాంతికి లోనయ్యారు.
A dear friend and very humble human, it’s heartbreaking to see him gone so soon. He will be dearly missed. Rest in peace babai. #TarakaRatna pic.twitter.com/T72HMwaohQ
— Allari Naresh (@allarinaresh) February 18, 2023
తారకరత్న అకాల మరణంపై టాలీవుడ్ సీనియర్ నటుడు రవితేజ భావోద్వేగానికి లోనయ్యారు. "ఎంతో పోరాడిన ప్రియతమ తారకరత్న విషాదకరమైన మరణం గురించి తెలుసుకుని చాలా బాధపడ్డాను! ప్రతి ఒక్కరి పట్ల ఆయన దయగల స్వభావం కోసం అతను ఎల్లప్పుడూ ప్రేమగా గుర్తుంచుకుంటాడు! ఆయన ఆత్మీయులకు నా ప్రగాఢ సానుభూతి. ఓం శాంతి.." అంటూ రవితేజ ట్వీట్ చేశారు.
Profoundly saddened to learn about the tragic demise of dear Taraka Ratna after battling hard!
He will always be fondly remembered for his kind-hearted nature towards everyone!
My sincere condolences to his dear ones. Om Shanti 🙏
— Ravi Teja (@RaviTeja_offl) February 18, 2023
తారకరత్న త్వరగా కోలుకొని సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి అని విజయసాయి రెడ్డి తెలిపారు.
సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగిరావాలని కోరుకున్నాం. కాని విధి మరోలా తలచింది. నందమూరి తారకరత్న అకాల మరణం అత్యంత బాధాకరం. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని శ్రీ వేంకటేశ్వరస్వామి వారిని ప్రార్థిస్తున్నాను. అభిమానులకు నా ప్రగాఢ సానుభూతి. pic.twitter.com/7JRmclqyLv
— Vijayasai Reddy V (@VSReddy_MP) February 18, 2023
ప్రత్యేక అంబులెన్స్‌లో తారకరత్న భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. అభిమానుల రద్దీని దృష్టిలో ఉంచుకొని నారాయణ హృదయాలయ ఆస్పత్రి వెనుక గేటు నుంచి భౌతికకాయాన్ని తరలిస్తున్నారు. తారకరత్న భౌతికకాయాన్ని నేరుగా మోకిలలోని తన నివాసానికి తరలిస్తారు. అనంతరం అభిమానుల సందర్శనార్థం సోమవారం ఫిలించాంబర్‌కి తీసుకువచ్చి, ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించనున్నారు.
తారకరత్న అకాల మరణం చాలా బాధాకరవిషయమని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తెలిపారు. తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలని పరమేశ్వరుణ్ణి ప్రార్థించారు.
శ్రీ నందమూరి తారకరత్న ఆత్మకు శాంతి చేకూరాలి - JanaSena Chief Shri @PawanKalyan pic.twitter.com/RmKnZZaSvv
— JanaSena Party (@JanaSenaParty) February 18, 2023
తారకరత్న అకాల మరణం పట్ల నటుడు మహేష్ బాబు తీవ్ర విచారం వ్యక్తం చేశారు. మమ్మల్ని వదిలి చాలా త్వరగా వెళ్ళిపోయావు సోదరా అంటూ ఎమోషనల్ అయ్యారు.
Shocked and deeply saddened by the untimely demise of #TarakaRatna. Gone way too soon brother... My thoughts and prayers are with the family and loved ones during this time of grief. 🙏
— Mahesh Babu (@urstrulyMahesh) February 18, 2023
తారకరత్న మరణంపై నారా లోకేష్ బాగా ఎమోషనల్ అయ్యారు. పాదయాత్రల తొలి రోజు తన వెంట తొలి అడుగులు వేసిన తారకరత్న ఇక లేడన్న వార్తను లోకేష్ జీర్ణించుకోలేకపోయారు. ఇకపై నన్ను ఆప్యాయంగా 'బావ' అని పిలిచే గొంతుక వినపడదంటూ కన్నీటి నివాళి అర్పించారు.
నిష్కల్మషమైన నీ ప్రేమ, స్నేహ బంధం మన బంధుత్వం కంటే గొప్పది. తారకరత్నకి కన్నీటి నివాళి అర్పిస్తూ, తారకరత్న పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను.(2/2)
— Lokesh Nara (@naralokesh) February 18, 2023
తారకరత్న మరణంపై నారా చంద్రబాబు నాయుడు స్పందించారు. తారకరత్న మరణం తనను తీవ్ర దిగ్భ్రాంతిని, బాధను కలిగించిందని తెలిపారు.
23 రోజుల పాటు మృత్యువు తో పోరాడిన తారకరత్న... చివరికి మాకు దూరం అయ్యి మా కుటుంబానికి విషాదం మిగిల్చాడు. తారకరత్న ఆత్మకు శాంతిని చేకూర్చాలని భగవంతుని ప్రార్థిస్తున్నాను.(2/2)
— N Chandrababu Naidu (@ncbn) February 18, 2023
తారకరత్న మరణంపై చిరంజీవి విచారం వ్యక్తం చేశారు. "ఈ వార్త నన్నెంతో దిగ్భ్రాంతికి గురిచేసింది. ఈ పరిశ్రమ ఓ అద్భుతమైన, టాలెంటెడ్ నటుడిని కోల్పోయింది. ఇంత చిన్న వయసులో తరకరత్న మన నుంచి దూరం కావడం చాలా బాధాకరం. వారి కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి.." అని చిరంజీవి తన ట్విటర్ ఖాతా ద్వారా తెలియజేశారు.
Deeply saddened to learn of the
tragic premature demise of #NandamuriTarakaRatna
Such bright, talented, affectionate young man .. gone too soon! 💔 💔
Heartfelt condolences to all the family members and fans! May his Soul Rest in Peace! శివైక్యం 🙏🙏 pic.twitter.com/noNbOLKzfX— Chiranjeevi Konidela (@KChiruTweets) February 18, 2023
మరికొన్ని నిమిషాల్లో తారకరత్న భౌతికకాయాన్ని హైదరాబాద్‌కు తరలించనున్నారు. ఇప్పటికే కాన్వాయ్‌ని కూడా సిద్ధం చేసినట్లు సమాచారం. రేపు ఉదయం 5 నుండి 6 గంటల మధ్య తారకరత్న భౌతికకాయం హైదరాబాద్ చేరుకోనుంది. తారక రత్న పార్థివదేహాన్ని నేరుగా మోకిలలోని తారకరత్న నివాసానికి తరలిస్తారు.