అలనాటి సినీతార జయకుమారి గురించి దక్షిణాది ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. ఇటీవల అనారోగ్యంతో చెన్నైలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేరడంతో జయకుమారి పేరు వార్తల్లోకెక్కింది. ఓవైపు ఆరోగ్యం పరిస్థితి.. మరోవైపు ఆర్థిక పరిస్థితి రెండూ బాగలేకపోవడంతో జయకుమారి హాస్పిటల్ లో చేరి ఇండస్ట్రీ వర్గాలలో చర్చనీయాంశంగా మారింది. వైద్యానికి డబ్బుల్లేక గవర్నమెంట్ హాస్పిటల్ లో చేరిన జయకుమారి పరిస్థితి తెలుసుకొని.. అటు మీడియా వర్గాలు, నెటిజన్స్, సినీవర్గాలు ఆమెకు సాయం చేసేందుకు ఎవరైనా ముందుకొస్తే బాగుంటుందని సోషల్ మీడియాలో కోరారు.
దీంతో ఈ విషయం ఇండస్ట్రీ అంతా చేరుకుని చివరగా తమిళనాడు హెల్త్ మినిస్టర్ ఎం. సుబ్రహ్మణ్యన్ చెవిన పడింది. వెంటనే స్పందించిన హెల్త్ మినిస్టర్.. స్థానిక కీల్ పాక్కం ప్రభుత్వాసుపత్రిలో ఉన్నటువంటి జయకుమారిని కలిసి పరామర్శించినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం జయకుమారి రెండు కిడ్నీలు పాడయ్యానని, అలాగే ఆమెకు సొంత ఇల్లు లేకపోవడంతో రూ. 750 లతో అద్దె ఇంట్లో ఉంటోందని తెలుసుకున్న హెల్త్ మినిస్టర్.. ఆమెకు వెంటనే మెరుగైన చికిత్స అందించాలని ఆసుపత్రి సిబ్బందిని ఆదేశించినట్లు సమాచారం. అనంతరం మినిస్టర్ సుబ్రహ్మణ్యన్.. నటి జయకుమారికి ప్రభుత్వం తరపున సొంత ఇల్లు ఏర్పాటు చేసే ప్రయత్నం చేస్తామని హామీ ఇచ్చారని కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి.
ఈ విషయం తెలిసి నెటిజన్స్, ప్రేక్షకులు జయకుమారి పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నారు. అలాగే తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలుపుతున్నారు. ఇదిలా ఉండగా.. ఎన్టీఆర్ మొదలుకొని ఎంజీఆర్, రాజ్ కుమార్, దిలీప్ కుమార్ లాంటి ఎందరో నాటి హీరోల సరసన 400 పైగా చిత్రాల్లో నటించిన జయకుమారి ఎక్కువగా ఐటమ్ సాంగ్స్ లో నర్తించినట్లు తెలుస్తుంది. తెలుగులో బాలమిత్రులకథ, మానవుడు దానవుడు, సంపూర్ణ రామాయణం, కళ్యాణ మండపం, ఇంటి గౌరవం లలాంటి సినిమాలలో నటించింది. మరి నటి జయకుమారి గురించి మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
Veteran actress #Jayakumari faces financial difficulties to meet medical expenses. Reportedly, TN health minister assures help. https://t.co/vRRusZzl79
— Chennai Times (@ChennaiTimesTOI) September 19, 2022