మిల్కీ బ్యూటీ తమన్నా, సత్యదేవ్, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శిన ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘గుర్తుందా..శీతాకాలం”. ఈ చిత్రం ద్వారా కన్నడ నటుడు నాగశేఖర్ టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. ఈ చిత్రం డిసెంబర్ 9న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న కొద్ది మూవీ టీమ్ ప్రమోషన్లతో బిజీబిజీగా గడుపుతుంది. సోమవారం హైదారాబాద్ లో ఈ సినిమాకు సంబంధించిన ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు అడవి శేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. అలానే ఈవెంట్ లో తమన్నా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. అంతేకాక స్టేజిపై సత్యదేవ్, తమన్నా..తమ మాటలతో నవ్వులు పూయించారు. “మీ భార్యను మాకు చూపించవా?” అంటూ ఈ సందర్బంగా సత్యదేవ్ ను తమన్నా ప్రశ్నిస్తుంది. దీంతో సత్యదేవ్ తన భార్య దీపికను పరిచయం చేస్తాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
చాలా కాలం తరువాత తమన్నా తెలుగులో నటించిన సినిమా “గుర్తుందా శీతాకాలం”. ఈ సినిమా రొమాంటిక్ ఎంటర్టైనర్ గా డిసెంబర్ 9న ప్రేక్షకు ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రీరిలీజ్ ఈవెంట్ ను సోమవారం హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ వేడుకకు ప్రముఖ యాంకర్ సుమ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ కార్యక్రమానికి మూవీ టీమ్ తో పాటు పలువుర సినీ ప్రముఖులు పాల్గొన్నారు. యంగ్ హీరో అడవి శేష్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సినిమా గురించి సత్యదేవ్, తమన్నాలు అనేక విషయాలు తెలియజేశారు. ఈ సందర్భాగా సత్యదేవ్ మాట్లాడుతూ.. “ఈ సినిమాలో తమన్న ధరించిన బిని అనే కాస్య్టూమ్ డిజైన్ అందరిని ఆకట్టుకుంటుంది. దానికి ఈ సినిమాలో ఓ ప్రత్యేక స్టోరీ ఉంటుంది. దానిని అంతే ప్రత్యేకంగా డిజైన్ చేయడం వెనుకాల దీపిక ఉంది. నా స్టైలింగ్ అంతా ఆమె చేసింది. ఈ సినిమా కోసం ప్రత్యేక కాస్ట్యూమ్స్ డిజైన్ చేసినందుకు దీపికకు కృతజ్ఞతలు” అని సత్యదేవ్ అన్నారు.
ఈ క్రమంలో తమన్న మధ్యలో మైక్ అందుకుని.. “ఈ సినిమాలో నటించిన ముగ్గురు హీరోయిన్లు ఇక్కడ ఉన్నారు. అలానే మీ రియల్ లైఫ్ లోని హీరోయిన్ ను స్టేజిపైకి పిలిచి పరిచయం చేస్తే బాగుంటుంది. ఆమె గురించి మాకు తెలుసు. ఆమెకు మీకు కేవలం స్టైలింగ్ మాత్రమే చేయలేదు. మీకు ప్రధాన బలం ఆమె అని తెలుసు. కాబట్టి ఆమెను కూడా పరిచయం చేస్తే బాగుంటుంది” అని తమన్నా అంటుంది. దీంతో తన భార్య దీపికను సత్యదేవ్ స్టేజిపైకి పిలవడంతో ఆమె వస్తుంది. స్టేజిపైకి బాబుతో సహా వచ్చిన దీపిక..అందరికి అభివాదం చేస్తుంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.