సినీ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న నటి సురేఖావాణి. ఒకప్పుడు వరుస సినిమాలతో ప్రేక్షకులను పలకరించిన సురేఖావాణి.. ఈ మధ్యకాలంలో తక్కువగా కనిపిస్తున్నారు. సినిమాలలో అడపాదడపా కనిపిస్తుంది కానీ.. సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టీవ్ గా ఉంటుందనే సంగతి అందరికి తెలిసిందే. ట్రెండ్ కి తగ్గట్టుగా కూతురితో పాటు లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తోంది.
సోషల్ మీడియా ఫాలోయింగ్ లో తల్లినే మించిపోయింది సుప్రీత నాయుడు(సురేఖా కూతురు). ఇంతవరకు ఒక్క సినిమాలో కూడా నటించలేదు.. కానీ ఫాలోయింగ్ బాగానే సంపాదించుకుంది. ఈ మధ్యే ప్రైవేట్ మ్యూజిక్ ఆల్బమ్ లో కనిపించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సినిమా హీరోయిన్ లకు ఏమాత్రం తగ్గకుండా తన గ్లామర్ తో నెట్టింట క్రేజ్ సొంతం చేసుకుంది.
ఇటీవలే సుప్రీత ‘వెళ్లిపో’ అనే మ్యూజిక్ ఆల్బమ్ లో నటించింది. వాలెంటైన్స్ డే రోజున విడుదలైన ఈ వీడియో సాంగ్ మంచి రెస్పాన్స్ దక్కించుకుంది. తాజాగా ఈ వీడియో సాంగ్ కి సంబంధించి ఓ ఇంటర్వ్యూలో నోరు విప్పింది సుప్రీత. ‘ఈ సాంగ్ షూటింగ్ లో సారీతో పరిగెత్తుకుంటూ వచ్చి.. హీరోని హగ్ చేసుకొని కిస్ చేయాలి. ఆ సీన్ టైంలో నాకు పరిగెత్తడం రాలేదు. కావాలని కిస్ సీన్ లో చాలా టేక్స్ తీసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం సుప్రీత ఇంటర్వ్యూ నెట్టింట వైరల్ అవుతోంది. మరి సుప్రీత పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.