Jailer: ఇండియన్ సినిమాలో సూపర్ స్టార్ రజనీ మాస్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. మాస్ నుండి క్లాస్ వరకూ దేశవ్యాప్తంగా క్రేజ్ కలిగిన తలైవా.. తన ఫ్యాన్స్ కోసం ఏడాదికో సినిమాను రిలీజుకు రెడీ చేస్తున్నాడు. ఈ క్రమంలో తాజాగా తలైవా తదుపరి సినిమాకు సంబంధించి టైటిల్ పోస్టర్ రిలీజ్ చేశారు మేకర్స్. మాస్ యాక్షన్ మూవీగా జైలు నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘జైలర్’ అనే పవర్ ఫుల్ టైటిల్ ఫిక్స్ చేశారు.
డాక్టర్, బీస్ట్ సినిమాల ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించనుండగా.. రజిని కెరీర్లో ఇది 169వ సినిమాగా తెరకెక్కనుంది. ఇక ఇంతవరకూ మాస్ క్యారెక్టర్స్ తో అలరించిన తలైవా.. త్వరలో జైలర్ గా ఫ్యాన్స్ కి ట్రీట్ ఇవ్వనున్నాడు. అయితే.. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్ లో రక్తపు మరకలతో కత్తిని డిజైన్ చేయడం ఆసక్తిని కలిగిస్తోంది. జైలు ఆధారంగా నెల్సన్ మాస్ యాంగిల్ లో ప్లాన్ చేశాడని టాక్.
ప్రస్తుతం సూపర్ స్టార్ జైలర్ టైటిల్ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇక ఈ సినిమాలో రజిని సరసన హీరోయిన్ గా ఐశ్వర్యరాయ్ నటించనుండగా.. రమ్యకృష్ణ, శివరాజ్‌కుమార్, ప్రియాంక అరుళ్ మోహన్ లాంటి స్టార్స్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. జులై నుండి ఈ సినిమా సెట్స్‌పైకి వెళ్లనుంది. ఈ సినిమాకు అనిరుధ్ సంగీతం అందిస్తుండగా.. సన్ పిక్చర్స్ బ్యానర్ పై కళానిధి మారన్ మూవీని నిర్మిస్తున్నారు.
ఇదిలా ఉండగా.. గతేడాది పెద్దన్న సినిమాతో థియేటర్లలో సందడి చేసిన రజిని ఫ్యాన్స్ ని ఆ సినిమా నిరాశపరిచింది. మరి డార్క్ కామెడీ యాక్షన్ సినిమాలు తెరకెక్కించే నెల్సన్.. ‘జైలర్’ మూవీతో తలైవాకు సూపర్ హిట్ ఇస్తాడేమో చూడాలి. అదీగాక.. పదేళ్ల కిందట బ్లాక్ బస్టర్ సృష్టించిన రోబో జంట(రజిని-ఐశ్వర్య) మరోసారి జతకట్టడంతో జైలర్ పై అంచనాలు పెరిగిపోయాయి. మరి సూపర్ స్టార్ జైలర్ సినిమా టైటిల్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ లో తెలియజేయండి.
#Thalaivar169 is #Jailer@rajinikanth @Nelsondilpkumar @anirudhofficial pic.twitter.com/tEtqJrvE1c
— Sun Pictures (@sunpictures) June 17, 2022