సినీ ఇండస్ట్రీలో అవార్డు ఫంక్షన్స్ జరిగాయంటే చాలు.. స్టేజ్ పై హీరోహీరోయిన్ల డాన్స్ పెర్ఫార్మన్సులను కళ్ళార్పకుండా చూస్తుంటారు అభిమానులు. ముఖ్యంగా యంగ్ హీరోయిన్స్ గ్లామర్ డ్రెస్సింగ్ స్టయిల్ తో డాన్స్ చేస్తే చూస్తున్న ప్రేక్షకులకు వినోదమే. తాము నటించిన సినిమాలలోని పాటలే కాకుండా.. ట్రెండింగ్ లో ఏ సాంగ్స్ ఉన్నా డాన్స్ చేస్తుంటారు. తాజాగా యంగ్ హీరోయిన్ శ్రీలీల.. పుష్ప సినిమాలోని ‘సామి సామి’ పాటకు సైమా అవార్డుల ఫంక్షన్ లో అదిరిపోయే మాస్ డాన్స్ చేసింది. ఈ ఏడాది పుష్ప సాంగ్స్ కి బెస్ట్ ఆల్బమ్ గా అవార్డు వచ్చిన సంగతి తెలిసిందే. ఇటీవల బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ కూడా సామి పాటకు డాన్స్ చేసింది.
ఈ క్రమంలో ఇప్పుడు శ్రీలీల డాన్స్ పెర్ఫార్మన్స్ సోషల్ మీడియాలో తెగవైరల్ అవుతోంది. రీసెంట్ గా పెళ్లి సందడి మూవీతో టాలీవుడ్ డెబ్యూ చేసిన శ్రీలీల.. ఓవైపు మాస్ రాజా రవితేజ సరసన ‘ధమాకా’ సినిమా చేస్తోంది. మరోవైపు నవీన్ పొలిశెట్టి సరసన ‘అనగనగా ఒక రాజు’ మూవీలో నటిస్తోంది. ధమాకా సినిమా డిసెంబర్ లో రిలీజ్ కాబోతుంది. ఇదిలా ఉండగా.. 2022 సైమా అవార్డుల వేడుకలో సౌత్ ఇండియన్ సెలబ్రిటీలంతా ఎవరి స్టైల్ లో వారు పెర్ఫర్మ్ చేశారు. ఇప్పుడైతే సామి సామి అంటూ శ్రీలీల చేసిన మాస్ పెర్ఫార్మన్స్ చూసి ఆమె ఫ్యాన్స్ తో పాటు పుష్ప మూవీ ఫ్యాన్స్ సైతం ఆనందం వ్యక్తం చేస్తున్నారు.